తెలంగాణ

telangana

'అఖండ' తర్వాత బాలకృష్ణ యమస్పీడుగా!

By

Published : Apr 24, 2021, 2:22 PM IST

కథానాయకుడు బాలకృష్ణ కూడా యువ హీరోల బాటలో వెళ్లాలని అనుకుంటున్నారు. ఒకేసారి రెండు సినిమాల్లో నటించి, వాటిని త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Balakrishna to shoot for two movies simultaneously
బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ జోరు చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం 'అఖండ'తో బిజీగా ఉన్న ఆయన.. ఆ తర్వాత రెండు సినిమాల షూటింగ్​ల్లో ఒకేసారి పాల్గొనాలని భావిస్తున్నారట.

మరికొద్ది రోజుల్లో 'అఖండ' చిత్రీకరణ పూర్తి కానుంది. జూన్ లేదా జులైలో ప్రారంభమయ్యే ప్రాజెక్టులో భాగంగా 'క్రాక్' ఫేమ్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తారని సమాచారం. ఆ తర్వాత కొన్నిరోజులకు అనిల్ రావిపూడితో కలిసి పనిచేయాలని అనుకుంటున్నారు. వీటిని వరుసగా వచ్చే ఏడాది సంక్రాంతి, వేసవి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీటిపై స్పష్టత రావాలంటే కొద్దికాలం ఆగాల్సిందే.

బాలకృష్ణ-అనిల్ రావిపూడి

ABOUT THE AUTHOR

...view details