తెలంగాణ

telangana

'తిమ్మరుసు'గా రాబోతున్న సత్యదేవ్​

By

Published : Sep 7, 2020, 9:16 PM IST

టాలీవుడ్ నటుడు సత్యదేవ్​ మరో సరికొత్త చిత్రంతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. సోమవారం ఈ సినిమాకు సంబంధించిన టైటిల్​ లోగోను విడుదల చేసింది చిత్రబృందం.

timmarusu
సత్యదేవ్

విభిన్నమైన కథలను ఎంచుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్‌. ఇటీవలే 'ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య' చిత్రంతో అలరించిన ఇతడు.. ఇప్పుడు 'తిమ్మరుసు' అనే మరో వైవిధ్యమైన సినిమాతో వస్తున్నాడు. సోమవారం ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్​ లోగోను విడుదల చేసింది చిత్రబృందం. త్వరలోనే షూటింగ్​ ప్రారంభం కానుంది. శరణ్​ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు.

'118' వంటి థ్రిల్లర్‌ చిత్రాన్ని నిర్మించిన ఈస్ట్‌ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై సృజన్‌ ఎరబోలు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో కథానాయిక, నటీనటులతో పాటు సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తామని నిర్మాతలు మహేష్‌ కోనేరు, సృజన్‌ ఎర్రబోలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details