తెలంగాణ

telangana

'రెడ్​వైన్​ తాగకపోతే రాత్రి నిద్ర పట్టదు'

By

Published : Jun 20, 2020, 10:10 PM IST

రెడ్​వైన్​ ఆరోగ్యానికి మంచిదని బుల్లితెర యాంకర్​ అనసూయ అంటుంది. రాత్రివేళలో తాను భోజనానికి బదులుగా ఆ పానీయాన్నే సేవిస్తున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

Anchor Anusuya will not sleep at night unless drinking red wine
'రెడ్​వైన్​ తాగకపోతే రాత్రి నిద్ర పట్టదు'

రాత్రివేళలో భోజనానికి బదులు రెడ్​వైన్​ తాగుతానంటోంది ప్రముఖ బుల్లితెర యాంకర్​ అనసూయ. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రెడ్​వైన్​ ఆరోగ్యానికి, గుండెకు చాలా మంచిదని వెల్లడించింది. ఆకలిగా ఉంటే రాత్రి నిద్రపట్టదని.. అందుకే నిద్రపోయే ముందు భోజనానికి బదులు రెడ్​వైన్​ తాగుతానని చెబుతోంది.

అయితే ఇలా ఇతరులకు నిద్రపట్టే అవకాశం ఉందో లేదో తనకు తెలియదని బదులిచ్చింది. తనకైతే ఆ పానీయం చాలా బాగా పనిచేస్తుందని వెల్లడించింది. అనసూయ ప్రస్తుతం అనేక టీవీ కార్యక్రమాల షూటింగ్​లో పాల్గొంటూ బిజీగా ఉంది.

యాంకర్​ అనసూయ

యాంకర్‌గా, నటిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది అనసూయ. 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం' తదితర సినిమాల్లో ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. బుల్లితెరతోపాటు వెండితెరపై కూడా రాణిస్తున్న అనసూయ.. ఆమె నటనతోపాటు వ్యక్తిత్వంతోనూ అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇదీ చూడండి... బాధ, ఒత్తిడి.. వేర్వేరు భావాలు: దీపికా పదుకొణె

ABOUT THE AUTHOR

...view details