అల్లుఅర్జున్ నటిస్తున్న 'పుష్ప' సినిమాలోని 'శ్రీవల్లి' సాంగ్ ప్రోమో విడుదలైంది. పూర్తి పాటను అక్టోబర్ 13న ఉదయం 11.07గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం. ఈ గీతాన్ని సిధ్ శ్రీరామ్ ఆలపించగా.. చంద్రబోస్ రచించారు. ఇప్పటికే రిలీజ్ అయిన 'దాక్కో దాక్కో మేక' సాంగ్(pushpa dakko dakko meka song) అభిమానులను ఆకట్టుకుంది. ఈ మూవీలో రష్మిక హీరోయిన్. కన్నడ నటుడు ధనుంజయ, మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, అజయ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. శేషాచలం అడవుల నేపథ్యంలో సాగే కథ ఇది. డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సాంగ్ రిలీజ్