తెలంగాణ

telangana

'అల వైకుంఠపురములో' అరుదైన రికార్డు

By

Published : May 16, 2020, 1:20 PM IST

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అల వైకుంఠపురములో'. ఈ సినిమాకు తమన్ అందించిన స్వరాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ ఆల్బమ్​ యూట్యూబ్​లో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

అల
అల

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన 'అల.. వైకుంఠపురములో' చిత్రం సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. తమన్‌ స్వరాలు అందించిన ఈ సినిమా ఆల్బమ్ తాజాగా 1 బిలియన్‌ వ్యూస్‌ను దక్కించుకుని యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్‌ సోషల్‌మీడియా వేదికగా సంగీత అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.

"మా ఆల్బమ్‌ను ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన సంగీత ప్రియులకు ధన్యవాదాలు. 'అల.. వైకుంఠపురములో' ఆల్బమ్‌ యూట్యూబ్‌‌లో 1 బిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుని దూసుకెళ్తోంది. నటీనటులు, గాయనీగాయకులు, పాటల రచయితలు, ఇతర చిత్రబృందానికి శుభాకాంక్షలు"

-గీతాఆర్ట్స్‌ ట్వీట్‌

ఈ సినిమాలోని పాటలకు సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి 'బుట్టబొమ్మ' సాంగ్‌కు టిక్‌టాక్‌ చేసి అలరించగా.. ఇటీవల అలనాటి తార సిమ్రాన్‌, ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ పీటర్సన్ 'బుట్టబొమ్ము' స్టెప్పులతో అలరించారు.

'అల వైకుంఠపురములో' అరుదైన రికార్డు

ABOUT THE AUTHOR

...view details