తెలంగాణ

telangana

'మేజర్​' రిలీజ్​ డేట్​.. చివరి షెడ్యూల్​లో 'లైగర్​'

By

Published : Feb 4, 2022, 1:15 PM IST

Updated : Feb 4, 2022, 2:00 PM IST

Adivi Sesh Major: కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. ఇందులో అడివి శేష్ నటించిన 'మేజర్'​, విజయ్ దేవరకొండ 'లైగర్​' సహా పలు చిత్రాల విశేషాలున్నాయి.

liger movie
Adivi Sesh Major

Adivi Sesh Major: అడివి శేష్‌ కథానాయకుడిగా శశి కిరణ్‌ తిక్కా తెరకెక్కిస్తున్న బహుభాషా చిత్రం 'మేజర్‌'. ఈ సినిమా కొత్త రిలీజ్​ డేట్​ను ప్రకటించారు మేకర్స్​. తెలుగు, హిందీ, మలయాళంలో చిత్రాన్ని మే 27న విడుదల చేయనున్నట్లు తెలిపారు.

మే27న 'మేజర్​' రిలీజ్​

ముంబయి 26/11 ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా ఈ సినిమా రూపొందుతోంది. దీనిని ఫిబ్రవరి 11న విడుదల చేయాలని తొలుత భావించినా.. కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. శోభిత ధూళిపాళ్ల, సయీ మంజ్రేకర్‌ కథా నాయికలుగా నటిస్తున్న 'మేజర్‌'లో ప్రకాశ్‌ రాజ్‌, రేవతి, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు.

'సెబాస్టియన్' టీజర్​ అప్డేట్​..

కిరణ్ అబ్బవరం నటిస్తోన్న కొత్త చిత్రం 'సెబాస్టియన్'​. ఫిబ్రవరి 25న విడుదలకానున్న ఈ సినిమా టీజర్​ను శనివారం ఉదయం 11.05 గంటలకు రిలీజ్​ చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ వీడియో విడుదలచేసింది చిత్రబృందం.

'కిన్నెర' సాంగ్​..

రాజశేఖర్‌ కథానాయకుడిగా ఆయన సతీమణి జీవిత తెరకెక్కిస్తున్న చిత్రం 'శేఖర్‌'. నేడు (ఫిబ్రవరి 4) పుట్టినరోజు కానుకగా.. సినిమాలోని 'కిన్నెర' లిరికల్ సాంగ్ విడుదల చేసింది చిత్రబృందం. మలయాళంలో విజయవంతమైన 'జోసెఫ్‌'కు రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో రాజశేఖర్‌ వయసు పైబడిన వ్యక్తిగా సరికొత్త లుక్‌తో సందడి చేయనున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతమందించారు. అను సితార, మస్కన్ సేతి హీరోయిన్లు.

కడుపుతో జెనీలియా భర్త..

'మిస్టర్​ మమ్మీ' పోస్టర్

భర్త రితేశ్​ దేశ్​ముఖ్​తో కలిసి జెనీలియా నటిస్తోన్న కొత్త చిత్రం 'మిస్టర్​ మమ్మీ'. కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని ఫస్ట్​లుక్​ పోస్టర్స్​ను విడుదల చేశారు మేకర్స్​. జెనీలియాతో పాటు రితేశ్​ కూడా కడుపుతో ఉండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. షాద్​ అలీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను భూషణ్ కుమార్, కృషణ్​ కుమార్ నిర్మిస్తున్నారు.

ఫిబ్రవరి 8న 'గని' నుంచి 'రోమియో జూలియెట్​' పాట
.
చివరి షెడ్యూల్​ చిత్రీకరణలో 'లైగర్​'

ఇవీ చూడండి:

Ram Pothineni: ఫిల్మ్​సిటీలో 'వారియర్'.. రామ్​ కోసం ఐదు భారీ సెట్లు

ప్రియాంక చోప్రాకు క్రేజీ ఛాన్స్​.. హాలీవుడ్​ స్టార్​ హీరోతో కలిసి..

నాని కాస్త డిఫరెంట్​.. సినిమా కోసం ఏకంగా ఏడు రిలీజ్ డేట్స్

Last Updated : Feb 4, 2022, 2:00 PM IST

ABOUT THE AUTHOR

...view details