తెలంగాణ

telangana

రెండు వారాల్లోనే.. ఆ నటి కుమారుడు, భర్త మృతి

By

Published : Jun 30, 2021, 5:09 PM IST

Updated : Jun 30, 2021, 5:35 PM IST

తెలుగు సీనియర్ నటి కవితకు కొవిడ్ తీరని శోకం మిగిల్చింది. రెండు వారాల వ్యవధిలో ఆమె భర్త, కుమారుడి మరణానికి వైరస్​ కారణమైంది. దీంతో పలువురు సినీ ప్రముఖులు ఆమెకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

actress Kavitha's husband passes away two weeks after son's death
కవిత

కరోనా ప్రభావంతో మన సినీ పరిశ్రమ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దానికితోడు పలువురు నటీనటులు, గాయకులు, ఇతరత్రా సాంకేతిక నిపుణులు కూడా ఈ వైరస్​తో పోరాడుతూ మరణిస్తుండటం.. అభిమానుల్ని బాధపెడుతోంది. అయితే నటి కవిత ఇంట్లోనూ కొవిడ్​ వల్ల తీవ్ర విషాదం నెలకొంది. ఆమె కుమారుడు, భర్త.. కేవలం రెండు వారాల వ్యవధిలోనే మృతి చెందారు.

భర్తతో కవిత

కవిత కుమారుడు సంజయ్.. కొన్నాళ్ల క్రితం కరోనా బారిన పడ్డారు. ఆ వైరస్​తో పోరాడుతూ జూన్ 16న తుదిశ్వాస విడిచారు. అప్పటికే కొవిడ్​కు గురైన ఆమె భర్త.. ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. కానీ ఆరోగ్యం విషమించడం వల్ల జూన్ 30న మరణించారు.

ఇవీ చదవండి:

Last Updated :Jun 30, 2021, 5:35 PM IST

ABOUT THE AUTHOR

...view details