తెలంగాణ

telangana

రజనీకాంత్​కు సర్జరీ .. ఆస్పత్రి బులెటిన్ విడుదల

By

Published : Oct 29, 2021, 4:18 PM IST

సూపర్​స్టార్ రజనీకాంత్(rajinikanth health) స్వల్ప అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయనకు విజయవంతంగా సర్జరీ చేశారు చెన్నై కావేరి ఆస్పత్రి వైద్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని హాస్పిటల్ వర్గాలు పేర్కొన్నాయి.

superstar rajini
రజనీకాంత్

తమిళ సూపర్​స్టార్ రజనీకాంత్(rajinikanth health) స్వల్ప అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం సర్జరీ అనంతరం ఆయన కోలుకుంటున్నారని చెన్నైలోని కావేరి హాస్పిటల్ వర్గాలు పేర్కొన్నాయి. తలనొప్పి, అస్వస్థత కారణంగా ఆయన(Rajini Latest News)ను గురువారం ఆస్పత్రిలో చేర్చాయని తెలిపాయి. కొన్ని రోజుల విశ్రాంతి అనంతరం ఆయన డిశ్ఛార్జి అవుతారని స్పష్టం చేశాయి.

"తలనొప్పి కారణంగా రజనీకాంత్ చెన్నైలోని అల్వార్​పేట్​ కావేరి ఆస్పత్రిలో చేరారు. గురువారం పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. శుక్రవారం ఆయనకు సర్జరీ(కారోటిడ్ ఆర్టరీ రివాస్కులైజేషన్) చేశాం. ప్రస్తుతం ఆయన క్రమంగా కోలుకుంటున్నారు" అని కావేరి ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్. అరవిందన్ సెల్వరాజ్ తెలిపారు.

70 ఏళ్ల రజనీకాంత్ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకునేందుకు మూడు రోజుల క్రితం దిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్​, ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులను కలిశారు. ప్రస్తుతం రజనీ నటిస్తోన్న 'అన్నాత్తే' చిత్రం నవంబర్ 4న విడుదల కానుంది.

ఇదీ చదవండి:

ఆసుపత్రిలో రజనీకాంత్​.. ప్రస్తుతం ఆరోగ్యంగానే

ABOUT THE AUTHOR

...view details