తెలంగాణ

telangana

ఖాజిపల్లి అర్బన్​ ఫారెస్ట్​ను దత్తత తీసుకున్న ప్రభాస్​

By

Published : Sep 7, 2020, 5:52 PM IST

Updated : Sep 7, 2020, 6:09 PM IST

హైదరాబాద్ నగర శివారు దుండిగల్ సమీపంలో ఖాజిపల్లి అర్బన్ ఫారెస్ట్ బ్లాక్​ను హీరో ప్రభాస్ దత్తత తీసుకున్నారు. మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి, ఎంపీ సంతోశ్​తో కలిసి శంకుస్థాపన చేశారు. 1,650 ఎకరాల అటవీ భూమిని ద‌త్త‌త తీసుకొని త‌న తండ్రి పేరిట అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ఇందుకోసం తక్షణ సాయంగా ప్రభాస్​ రెండు కోట్ల రూపాయలు అందించారు.

prabhas
prabhas

హైదరాబాద్ నగర శివారు దుండిగల్‌ సమీపంలో ఖాజిపల్లి అర్బన్‌ ఫారెస్టు పార్క్‌కు రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోశ్​ ‌కుమార్​తో కలిసి యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్ శంకుస్థాపన చేశారు. ఈ పార్కును ప్రభాస్ దత్తత తీసుకున్నారు. దీంతో ఔటర్ రింగ్‌ రోడ్డు వెంట మరో అర్బన్ ఫారెస్టు పార్కు అందుబాటులోకి రానుంది. తన తండ్రి దివంగత యూవీఎస్‌ రాజు పేరు మీద అర్బన్ పార్కు, అటవీ ప్రాంతాన్ని అభివృద్ది చేయనున్నట్లు ప్రభాస్ తెలిపారు.

ఖాజిపల్లి అర్బన్​ పారెస్ట్​ను దత్తత తీసుకున్న ప్రభాస్​

ఈ పార్కు నిర్మాణం కోసం 1,650 ఎకరాల అటవీ భూమిని ఎంపీ సంతోశ్​ కుమార్‌ చొరవతో దత్తత తీసుకున్న ప్రభాస్​... రెండు కోట్ల రూపాయలు అందించారు. అవసరాన్ని బట్టి మరింత ఖర్చు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యూ పాయింట్ నుంచి అటవీ అందాలను ప్రభాస్ పరిశీలించారు. అనంతరం సంతోశ్​ కుమార్​తో కలిసి ప్రభాస్ మొక్కలు నాటారు.

మొక్కలు నాటిన ప్రభాస్​

త్వరలో మరిన్ని అర్బన్ ఫారెస్టు బ్లాక్‌ల దత్తతకు ప్రయత్నిస్తానని ఎంపీ సంతోశ్​ ‌కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి శాంతి కుమారి, పీసీసీ ఎఫ్‌ శోభ ఇతర అధికారులు పాల్గొన్నారు.

వ్యూ పాయింట్ వద్ద ఎంపీ సంతోశ్​తో ప్రభాస్
Last Updated : Sep 7, 2020, 6:09 PM IST

ABOUT THE AUTHOR

...view details