తెలంగాణ

telangana

వాట్సాప్​ మెసేజ్​లు ఫార్వార్డ్​ చేస్తుంటారా?.. ఈ సూపర్ ఫీచర్​ మీకోసమే!

By

Published : Apr 17, 2023, 8:48 PM IST

Updated : Apr 17, 2023, 9:21 PM IST

సోషల్ మీడియా వినియోగం తారాస్థాయికి చేరింది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా యాప్​లను వాడుతున్నారు. ముఖ్యంగా వాట్సాప్ యాప్ అందరి ఫోన్లలో తప్పనిసరిగా మారింది. అలాంటి ఈ పాపులర్ యాప్​లో మరో సరికొత్త ఫీచర్ రానుంది. అదేంటో తెలుసుకుందాం.

WhatsApp to Soon Let You Add More Context to a Forwarded Message
WhatsApp to Soon Let You Add More Context to a Forwarded Message

వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్​ను ఊహించగలమా?.. అనే స్థాయిలో ఆ యాప్ వినియోగం పెరిగింది. ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్​, ట్విట్టర్​ లాంటి అనేక సోషల్ మీడియా వేదికలు ఉన్నప్పటికీ వాట్సాప్ వాటిల్లో చాలా ప్రత్యేకం అనే చెప్పాలి. ఆన్​లైన్​ మెసేజింగ్​కు దీన్ని మించినది మరొకటి లేదు. బంధువులు, మిత్రులు, సహోద్యోగులు.. ఇలా ఎవ్వరితోనైనా టచ్​లో ఉండేందుకు వాట్సాప్ తప్పనిసరిగా మారింది!

అయితే యూజర్ల సంఖ్య పెరిగేకొద్దీ యాప్​లో మరిన్ని అప్డేట్స్ చేసుకుంటూ పోతోంది వాట్సాప్. డేటా సేఫ్టీకి అధిక ప్రాధాన్యత ఇస్తూనే సరికొత్త ఫీచర్లనూ జోడిస్తూ వస్తోంది. ఇప్పుడు మరో నూతన ఫీచర్​ను తీసుకురానుందని తెలుస్తోంది. ఫార్వర్డ్ మెసేజ్​కు క్యాప్షన్ జోడించే సదుపాయాన్ని వాట్సాప్ అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ గనుక అందుబాటులోకి వస్తే.. ఫార్వర్డెడ్ మెసేజెస్​కు అదనపు టెక్స్ట్​ను యాడ్​ చేయడానికి అవుతుంది.

వాట్సాప్​ బేటా ఇన్ఫో అనే సంస్థ తాజా నివేదిక ప్రకారం.. వాట్సాప్​ ఈ కొత్త ఫీచర్​ను ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.23.8.22లో పరీక్షిస్తోంది. ఈ ఫీచర్ వల్ల ఫార్వర్డెడ్ మెసేజెస్ ఏముందనే విషయాన్ని, మీరు చెప్పాలనుకునే అంశాన్ని టెక్స్ట్ రూపంలో జోడించే అవకాశం కలగనుంది. ప్రస్తుతం వాట్సాప్​లో ఏవైనా ఫొటోలు, వీడియోలు లేదా సందేశాలు, జిఫ్లు, డాక్యుమెంట్లు లాంటివి మరొకరికి ఫార్వర్డ్ చేసే క్రమంలో ఇంతకుముందు ఉన్న క్యాప్షన్లను అలాగే ఉంచడం లేదా తొలగించే సదుపాయమే ఉంది.

కొత్త ఫీచర్​తో ఇవే ప్రయోజనాలు!
క్యాప్షన్లను అలాగే ఉంచేయడం లేదా తొలగించే ఫీచర్ యూజర్లకు అంతగా ఉపయోగపడట్లేదు. అదే కొత్త ఫీచర్ గనుక అందుబాటులోకి వస్తే.. అప్పటికే ఉన్న క్యాప్షన్ను తీసేసి, దాని స్థానంలో కొత్త క్యాప్షన్ జత చేయొచ్చు. ఏ సందర్భాన్ని బట్టి ఫార్వర్డ్ చేస్తున్నాం అనేది కూడా ఇకపై మెసేజెస్లో జతచేసే వీలుంటుంది. మరో విషయం ఏంటంటే.. మీరు పంపే కొత్త క్యాప్షన్ అవతలి వారికి కొత్త మెసేజ్​ రూపంలోనే వెళ్తుంది. దీని వల్ల ఆ సందేశం అసలుదా లేదా నకిలీదా అనేది తెలుసుకునే అవకాశం మెసేజ్ అందుకున్న రిసీవర్​కు ఉంటుంది. కొత్త క్యాప్షన్ జతచేయడం వల్ల మెసేజ్ ఎందుకు పంపారు? దీనికి కారణం ఏంటనేది కూడా అర్థం చేసుకునేందుకు ఆస్కారం కలుగుతుంది.

బీటా యూజర్లా? అయితే అప్డేట్ చేస్కోండి!
ఆండ్రాయిండ్ బీటా వాట్సాప్ యూజర్లకు మాత్రమే కొత్త ఫీచర్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సాప్​. అయితే ఈ బీటా అప్డేట్ వల్ల వీడియోలు డౌన్లోడ్ చేసుకోనేటప్పుడు, స్టేటస్ అప్డేట్స్ చూసేటప్పుడు అంతరాయం కలిగే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఒకవేళ మీరు వాట్సాప్ బీటా ప్రోగ్రామ్ యూజర్లు అయ్యి ఉండి, కొత్త ఫీచర్ వల్ల ఇబ్బందులు కలిగినా పర్వాలేదని అనుకుంటే మాత్రం.. యాప్​ను అప్డేట్ చేసుకుంటే సరిపోతోంది. అప్డేట్ అయ్యాక మీ వాట్సాప్​లో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిందా లేదా చెక్ చేసుకోండి!

త్వరలో మరో రెండు అద్భుతమైన ఫీచర్లు
ఈ నయా వాట్సాప్ ఫీచర్ సాధారణ యూజర్లకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనేది ఇంకా తెలియరాలేదు. కానీ అతి త్వరలో ఇది సాధ్యమయ్యే సూచనలు ఉన్నాయని సమాచారం. ఈ నూతన క్యాప్షన్ ఫీచర్​తో పాటు రీడిజైన్డ్ యూజర్ ఇంటర్ఫేస్​ను కూడా వాట్సాప్ అభివృద్ధి చేస్తోందట. కాంటాక్ట్​లను యాప్​లోనే ఎడిట్ చేసుకునే సదుపాయాన్ని కూడా డెవలప్ చేస్తోందట. కాగా, ఇటీవలే పలు కొత్త సెక్యూరిటీ ఫీచర్లను వాట్సాప్ యాడ్ చేసింది. స్కామర్​ల బారి నుంచి రక్షణ కోసం మూడు కొత్త ఫీచర్లను జతచేసింది.

Last Updated :Apr 17, 2023, 9:21 PM IST

ABOUT THE AUTHOR

...view details