తెలంగాణ

telangana

మార్కులు వేయలేదని టీచర్​ను చెట్టుకు కట్టేసి కొట్టిన స్టూడెంట్స్​

By

Published : Sep 1, 2022, 10:30 AM IST

Students tie teachers to a tree

ఎక్కడైనా తక్కువ మార్కులు వచ్చాయని విద్యార్థుల్ని టీచర్లు కొట్టడం చూసుంటాం. కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నం. కావాలనే తక్కువ మార్కులు వేశారని టీచర్​ను కొట్టారు ఓ స్కూల్​ విద్యార్థులు. ఈ ఘటన ఝార్ఖండ్‌లో జరిగింది.

టీచర్లను కొడుతున్న విద్యార్థులు

తక్కువ మార్కులు వచ్చాయన్న కారణంతో విద్యార్థులను దండించే ఉపాధ్యాయులను చూసే ఉంటాం. ఇక్కడ మాత్రం సీన్‌ రివర్స్! కావాలనే తమకు తక్కువ మార్కులు వేశారని ఆరోపిస్తూ ఉపాధ్యాయుడిని, క్లర్క్‌ను చెట్టుకు కట్టి కొట్టారు విద్యార్థులు. ఝార్ఖండ్‌లోని ఓ రెసిడెన్షియల్‌ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఝార్ఖండ్‌ అకడమిక్‌ కౌన్సిల్‌ ఇటీవల తొమ్మిదో తరగతి ఫలితాలను వెలువరించింది. ఈ ఫలితాల్లో ఝార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలోని ఓ రెసిడెన్షియల్‌ పాఠశాలకు చెందిన 32 మంది విద్యార్థుల్లో 11 మందికి డీడీ గ్రేడ్‌ వచ్చింది. ప్రాక్టికల్స్​లో మార్కులు తక్కువ వేయడం వల్లే తాము పరీక్షలో ఫెయిల్‌ అయ్యామని వారు ఆరోపించారు. కావాలనే ఇలా చేశారంటూ గణిత ఉపాధ్యాయుడిని, మార్కులు ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేసిన క్లర్క్‌ను చెట్టుకు కట్టి కొట్టారు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లినప్పటికీ.. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు చేసేందుకు నిరాకరించిందట. అయితే, ప్రాక్టికల్స్ మార్కులు ఫలితాల్లో నమోదుకావని ఉపాధ్యాయులు చెబుతుండడం గమనార్హం. కేవలం వదంతుల ఆధారంగా విద్యార్థులు ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details