ETV Bharat / spiritual

ఈరోజు ఆ రాశివారికి ప్రమోషన్ వచ్చే ఛాన్స్! శివాష్టకం పఠిస్తే మేలు! - Horoscope Today May 1st 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 1, 2024, 5:00 AM IST

Horoscope Today May 1st 2024
Horoscope Today May 1st 2024

Horoscope Today May 1st 2024 : మే​ 1న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today May 1st 2024 : మే​ 1న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు పురోగతి ఉంటుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ముఖ్యమైన చర్చలు ఫలవంతంగా ఉంటాయి. గృహాలంకరణ పట్ల శ్రద్ధ పెడతారు. మాతృవర్గం నుంచి ధనలాభం ఉంటుంది. ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. కానీ మీరు అన్ని పనులు సకాలంలో పూర్తి చేసి పై అధికారుల ప్రశంసలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగులు పని నిమిత్తం చేసే ప్రయాణం కలిసివస్తుంది. ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి. వ్యాపారులకు శత్రుజయం, రుణ విమోచనం ఉంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ నాటి నుంచి వృషభ రాశిలో బృహస్పతి సంచారం ఉన్నందున పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. ఈ రాశి వారు దూర దేశాలకు, తీర్థయాత్రలకు ప్రయాణం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రయాణాలు అనుకూల ప్రయోజనాలు ఇస్తాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది. స్థిరాస్తి వ్యాపారాలు కొత్త వెంచర్లు మొదలు పెట్టడానికి శుభంగా ఉంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. శివారాధన మేలు చేస్తుంది.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు గ్రహసంచారం బాగాలేదు కాబట్టి అన్ని విషయాలలో అప్రమత్తంగా ఉండడం మేలు. అశుభకరమైన సంఘటనలు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్నవారు వీలైనంత వరకు ఈ రోజు శస్త్ర చికిత్స వాయిదా వేస్తే మంచిది. ధన నష్టం సూచితం. ముఖ్యమైన వ్యవహారాల్లో దూకుడు తగ్గించుకోకపోతే నష్టం వాటిల్లుతుంది. సహనంతో, మనో నిబ్బరంతో మెలిగితే మంచిది. కొన్ని సంఘటనలలో మీ అజాగ్రత్త పరువునష్టానికి దారితీయవచ్చు. హనుమాన్ చాలీసా పఠిస్తే మేలు జరుగుతుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. బందు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. వృత్తిపరంగా పలు ప్రయోజనాలు ఉంటాయి. ఆర్థికంగా లాభపడతారు. వ్యాపారులు తమ భాగస్వాముల నుంచి ప్రయోజనం పొందవచ్చు. గతం తాలూకు జ్ఞాపకాలు సంతోషం కలిగిస్తాయి. సమాజంలో గౌరవం, ప్రఖ్యాతులు పెరుగుతాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఈ రోజు కొన్ని సంఘటనలు కారణంగా ఉద్రిక్తతకు లోనవుతారు. ఇంట్లో గొడవలు, కలహాలతో మనశ్శాంతి లోపిస్తుంది. గ్రహసంచారం బాగోలేదు కాబట్టి ముఖ్యమైన పనులన్నీ వాయిదా వెయ్యండి. పనులు సకాలంలో పూర్తి కానందున పని ప్రదేశంలో కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏది ఏమైంగా ధైర్యంగా ఉండండి. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శని శ్లోకాలు పఠిస్తే ఆపదలు తొలగుతాయి.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. వ్యాపారులు పెట్టుబడులు పెట్టేముందు బాగా ఆలోచించుకోవాలి. మోసం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులు విజయం కోసం తీవ్రమైన కృషి చేయాలి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆచి తూచి అడుగు వేయాలి. వృత్తి సంబంధమైన చర్చలకు దూరంగా ఉంటే మేలు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. గణపతి ధ్యానం మేలు చేస్తుంది.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. మీ గత తప్పిదాలకు ఫలితం ఈ రోజు అనుభవిస్తారు. మీ తల్లిగారి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంటుంది. ఆస్తికి సంబంధించిన పత్రాలు, కోర్టు వ్యవహారాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. కుటుంబ వాతావరణం అస్థిరంగా ఉండడం ఆందోళన కలిగిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో అవమానకరంగా మారే పరిస్థితుల నుంచి దూరంగా ఉండండి. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అదృష్టవంతంగా ఉంటుంది. అన్ని రకాల వృత్తి వ్యాపారాలు చేసే వారిని ఈ రోజు అదృష్టం వరిస్తుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. కొత్త వెంచర్లు మొదలుపెట్టడానికి మంగళకరమైన రోజు. కుటుంబ సభ్యులతో మీ సంబంధ బాంధవ్యాలు మెరుగయ్యే పరిస్థితి ఉంది. ఇంట్లో జరిగే ముఖ్యమైన చర్చలు సఫలం అవుతాయి. ఆర్థిక సంబంధమైన విజయం ఉంది. అన్ని వైపులా అదృష్టం కలిసి వస్తుంది. బంధు మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. అనుకోని విజయం, ఆకస్మిక ధనలాభం మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి. సుబ్రమణ్య ఆరాధనతో మేలు చేకూరుతుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఏ విషయంలోనూ నిర్లక్ష్యం కూడదు. విజయం అవలీలగా వస్తుందని భావించడం పొరపాటు. మీ ప్రయత్నం లోపం లేకుండా చూసుకోండి. జీవిత భాగస్వామితో స్వల్ప ఘర్షణలకు అవకాశముంది. సహనంతో ఉంటే మేలు. కోపంలో మాటలు అదుపు తప్పితే సంబంధాలు దెబ్బ తింటాయి. మానసికంగా దృఢంగా ఉండండి. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారంతో మనసు కుదుట పడుతుంది. ఇష్ట దేవతారాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఈ రోజు ఆధ్యాత్మిక సంబంధమైన కార్యకలాపాలలో గడుపుతారు. వ్యాపారులు, ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రయత్నాలు, బాధ్యతలు, కర్తవ్యాలూ అన్నీ ఫలిస్తాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే సూచనలున్నాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. గృహంలో శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. వాహన గండం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. శివాష్టకం పఠిస్తే గండాలు తొలగుతాయి.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అన్ని రకాల వృత్తి వ్యాపార రంగాల వారికి అనుకూలంగా ఉంది. అద్భుతమైన వాక్చాతుర్యంతో పలువురి ప్రశంసలు అందుకుంటారు. మీరు పనిచేసే సంస్థ అభివృద్ధిలో కీలకంగా మారుతారు. అనవసర వాదనలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా మెరుగుపడతారు. ఆదిత్య హృదయం పఠిస్తే మరిన్ని విజయాలు సొంతమవుతాయి.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. పిల్లలకు సంబంధించి శుభవార్తను వింటారు. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ ఛాన్స్ ఉంది. జీతం కూడా పెరుగుతుంది. వ్యాపారులకు ఏర్పడే కొత్త పరిచయాలు భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటాయి. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి పరంగా, ఆర్థిక పరంగా పలు ప్రయోజనాలు ఉంటాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.