తెలంగాణ

telangana

ఇది ఉంటే చాలు! మామూలు సైకిల్​ను ఇ-బైక్​గా మార్చేయెచ్చు

By

Published : Nov 11, 2022, 7:46 AM IST

ఈ మధ్య యువతరం ఎక్కువగా సైకిల్​పై ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఎక్కువ రేటుతో కూడుకునే ఎలక్ట్రిక్​ సైకిల్​ను కొనడానికి ఆసక్తి చూపించడం లేదు. అందుకే దీనికోసం అమెరికాకు చెందిన ఓ కంపెనీ.. పెద్దగా ఖర్చు లేకుండానే సంప్రదాయ సైకిళ్లను ఇ-బైక్​గా మార్చేస్తున్నాయి. దాని విశేషాలు ఏంటో తెలుసుకుందామా మరి..!

normal cycle to electric cycle
ఎలక్ట్రిక్​ సైకిల్ కిట్​

సైకిల్‌ తొక్కటమంటే ఎవరికి ఇష్టముండదు? అన్నివయసుల వారికీ ఆసక్తే. చాలామంది సంప్రదాయ సైకిళ్లను ఇష్టపడుతుంటారు గానీ నేటి తరానికి ఎలక్ట్రిక్‌ బైకులంటే మక్కువ. రెండింటి ఉద్దేశం ఒకటే అయినప్పటికీ ఇ-బైకుల్లోని వివిధ భద్రత ఫీచర్లు బాగా ఆకట్టుకుంటుంటాయి. అయితే వీటి ధర చాలా ఎక్కువ. మరి పెద్దగా ఖర్చు పెట్టకుండానే మామూలు సైకిల్‌నే ఇ-బైకుగా మారిస్తే? ఇందుకోసమే ఒక అమెరికా కంపెనీ పికాబూస్ట్‌ అనే కిట్‌ను తయారుచేసింది.

ఎలక్ట్రిక్​ సైకిల్ కిట్​

ఇది కొద్ది నిమిషాల్లోనే సంప్రదాయ సైకిల్‌ను ఇ-బైకుగా మార్చేస్తుంది. దీన్ని అమర్చుకోవటం సులభం. సైకిలు సీటు కింద బిగిస్తే చాలు. చక్రం తిరగటానికి తోడ్పడే భాగం సైకిలు టైరును పట్టుకొని ముందుకు నడిపిస్తుంది. పికాబూస్ట్‌ కిట్‌లో 234 వాట్ల బ్యాటరీ ఉంటుంది. ఇది మూడు గంటల్లోనే మొత్తం ఛార్జ్‌ అవుతుంది. ఒకసారి ఛార్జ్‌ చేస్తే 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చు. బ్రేకును పట్టుకున్నప్పుడు, రోడ్డు వాలుగా ఉన్నప్పుడు ఈ కిట్‌ ఇంధనాన్ని ఆదా చేసుకుంటుంది కూడా. మరింత ఎక్కువదూరం ప్రయాణించాలంటే మధ్యమధ్యలో మామూలు సైకిల్‌ మాదిరిగానూ తొక్కొచ్చు. కిట్‌ కేవలం 3 కిలోల బరువే ఉంటుంది. సంచీలో వేసుకొని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. స్మార్ట్‌ఫోన్ల వంటి గ్యాడ్జెట్లనూ దీంతో ఛార్జ్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేక యూఎస్‌బీ పోర్టు ఉంటుంది మరి. సైకిల్‌ యజమాని సెల్‌ఫోన్‌ దగ్గర్లో లేకపోతే దీనికి దానంతటదే తాళం పడుతుంది. మన్నిక విషయంలో ఐపీ66 గ్రేడ్‌ దీని సొంతం. అంటే ఇసుక, దుమ్ము, నీటిని తట్టుకుంటుందన్నమాట. హోల్డ్‌, రోల్‌, స్పోర్ట్‌ మోడ్‌లలో ఈ సైకిల్‌ మీద ఇష్టమైనట్టుగా ప్రయాణించొచ్చు.

ABOUT THE AUTHOR

...view details