తెలంగాణ

telangana

'2040 నాటికి చంద్రుడిపైకి భారత వ్యోమగామి- 2025లో ఇండియన్ స్పేస్ స్టేషన్ ప్రారంభం!​'

By PTI

Published : Dec 12, 2023, 7:40 PM IST

Indian Astronauts On Moon ISRO : 2040 నాటికి చంద్రునిపైకి తొలిసారిగా భారత​ వ్యోమగాములను పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఇస్రో. ఈ మిషన్​కోసం భారత్​కు చెందిన వ్యోమగాములను పంపించేందుకు రెడీ అవుతోందని ఇస్రో ఛైర్మన్​ తెలిపారు. ఈ మేరకు మనోరమ ఇయర్​బుక్ 2024 వారికి ఇచ్చిన ఇంటర్య్యూలో ఆయన తెలిపారు.

India Astronauts On The Moon By 2040
India Astronauts On The Moon By 2040

Indian Astronauts On Moon ISRO :చంద్రయాన్-3 చరిత్రాత్మక విజయం తర్వాత చంద్రుడిపైకి భారత వ్యోమగామిని పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో సిద్ధమైంది. అందుకు సంబంధించిన ప్రయత్నాల్లో నిమగ్నమైంది. 2040 నాటికి వ్యోమగామిని చంద్రుడిపైకి పంపాలన్న లక్ష్యంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన నలుగురు పైలట్లను వ్యోమగాములుగా శిక్షణ ఇవ్వడానికి ఎంపిక చేసినట్టు ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ వెల్లడించారు.

ప్రస్తుతం ఈ వ్యోమగాములు గగన్‌యాన్ మిషన్ కింద బెంగళూరులో ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీలో శిక్షణ పొందుతున్నట్లు సోమ్​నాథ్​ తెలిపారు. భూమికి సమీపంగా ఉండే దిగువ కక్ష్యలోకి ఇద్దరు లేదా ముగ్గురు వ్యోమగాములను పంపడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. అంతరిక్షంలో వారు మూడు రోజులు గడిపాక సురక్షితంగా భూమికి తిరిగి వస్తారని పేర్కొన్నారు. గతవారం విడుదలైన మనోరమ ఇయర్ బుక్ 2024లో ఈ వివరాలను ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలియజేశారు.

గగన్‌యాన్ మిషన్‌లో వ్యోమగాములను సురక్షితంగా గగనంలోకి పంపగలిగే కీలకమైన సాంకేతిక వ్యవస్థ వ్యోమనౌక (హెచ్‌ఎల్‌వీ ఎం3)లో ఉంది. ఈ ఆర్బిటల్ మోడ్యూల్‌లో క్రూ మోడ్యూల్(సీఎం)సర్వీస్ మోడ్యూల్ (ఎస్‌ఎం), ప్రాణాధార వ్యవస్థలు ఉన్నాయి. అయితే గగన్‌యాన్‌కు ముందు ఇస్రో ఎయిర్‌డ్రాప్ టెస్ట్, ప్యాడ్ అబార్ట్ టెస్ట్, వ్యోమనౌకపై ప్రయోగాలతోపాటు రెండు మానవ రహిత ప్రయోగాలు (జీ1, జీ 2) కూడా చేపడుతుంది. ఈ దిశగా ఇప్పటికే టెస్ట్ వెహికల్ ప్రయోగాన్ని ఇస్రో నిర్వహించింది. అత్యవసర సమయాల్లో వ్యోమగాములు సురక్షితంగా తప్పించుకోడానికి అవసరమైన క్రూ ఎస్కేప్ సిస్టమ్ (సీఈఎస్) ను పరీక్షించింది.

2025 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్​ను ప్రారంభించాలని ప్రధాని మోదీ అత్యంత ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను నిర్దేశించారని సోమనాథ్ వివరించారు. ప్రపంచ అంతరిక్ష వేదికపై భారత ఉనికి మరింత పటిష్ఠం కావడానికి వీలుగా శుక్ర, అంగారక గ్రహాలపై అన్వేషణ ప్రారంభించాలని ప్రధాని లక్షాలను నిర్దేశించారని సోమనాథ్ వివరించారు. భారత అంతరిక్ష పరిశోధన కార్యక్రమం రానున్న సంవత్సరాల్లో ఉన్నత శిఖరాలకు చేరగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

చంద్రయాన్​-4కు ఇస్రో రెడీ- జాబిల్లి నుంచి మట్టి తీసుకురావడమే టార్గెట్​

ఇస్రో మరో ఘనత- జాబిల్లి నుంచి భూకక్ష్యలోకి చంద్రయాన్-3 మాడ్యూల్‌!

ABOUT THE AUTHOR

...view details