తెలంగాణ

telangana

'ఆంధ్రా పెసరట్టు' సింపుల్​ రెసిపీ

By

Published : Jun 15, 2020, 1:08 PM IST

రోజూ రొటీన్​ బ్రేక్​ఫాస్ట్​లు తిని బోర్​ కొట్టేసిందా..? ఇప్పుడిప్పుడే ఫిట్​నెస్​ వైపు అడుగులేస్తూ.. నోరు కట్టుకుని డైటింగ్​లు చేయడం కష్టంగా ఉందా? అలాంటి వారు, బ్రేక్​ఫాస్ట్​లో ఈ ఆంధ్రా స్పెషల్​ పెసరట్టు తినాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం... ఆహా అనిపించే రుచితో.. మీరు కోరుకునే ఆరోగ్యాన్ని మీ సొంతం చేసే ఈ ప్రత్యేక పెసరట్టు ఎలా చేయాలో చూసేద్దాం రండి.

how to make pesarattu at home learn recipe
ఆంధ్రా స్పెషల్​ పెసరట్టు చిటికెలో చేసేద్దామిలా...

ఉరుకుల పరుగుల జీవితంలో.. ఉదయాన్నే ఏదో ఒకటి తిని రోజు మొదలెడితే సరిపోతుంది అనుకుంటాం. కానీ, ఉదయం తీసుకునే ఆహారమే రోజంతా మనకు శక్తినిస్తుంది అన్న సంగతి మరచిపోతాం. కడుపు మాడ్చుకుని ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాం. కానీ, మన తెలుగువారి వంటింట్లోనే అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి. అందులో ఒకటి ఈ ఆంధ్రా స్పెషల్​ పెసరట్ట.

పెసరట్టులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పెసర్లలో కొవ్వు శాతం చాలా తక్కువ. పైగా కావలసినంత ఫైబర్​ ఉంటుంది. ఇది బరువు పెరగకుండా చేస్తుంది. మీ శరీరాన్ని డీటాక్స్​ చేసి.. దీర్ఘకాలిక అనారోగ్యాలను దూరం చేస్తుంది. పెసరట్టు మీ శరీరానికి శక్తినిచ్చి, రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. మరి ఈ టేస్టీ, హెల్దీ పెసరట్టు ఎలా చేయాలంటే...

కావలసినవి ఇవే...

పెసర్లు-1 కప్పు, బ్రౌన్ రైస్​-2 టేబుల్​ స్పూన్లు, నీళ్లు-తగినంత, పచ్చిమిర్చి-2, అల్లం-అంగుళం ముక్క, ఉప్పు-రుచికి తగినంత, నూనె-1 టేబుల్ స్పూన్​, ఆవాలు- 1టీస్పూన్​, జీలకర్ర- 1టీస్పూన్​, ఉల్లిపాయలు- అర కప్పు

సింపుల్​గా తయారీ విధానం...

ఆంధ్రా స్పెషల్​ పెసరట్టు చిటికెలో చేసేద్దామిలా...

పెసర్లు, బ్రౌన్​ రైస్​లో తగినంత నీళ్లు పోసి.. నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి. ఆపై మిక్సీలో వేసి, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు వేసుకుని మెత్తగా, దోశ పిండిలా రుబ్బుకోవాలి. నూనెలో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక, ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి. ఎర్రగా వేగిన ఉల్లిపాయలను పిండిలో కలిపేసుకోవాలి. అంతే పెనం మీద కొంచెం నూనె, అట్టు వేసుకుని వేడి వేడిగా అల్లం చట్నీ లేదా, పల్లీ చట్నీతో వడ్డించండి.

ఇదీ చదవండి:దిల్లీ మెచ్చిన 'కచాలు చాట్'.. ఆహా ఏమి రుచి

ABOUT THE AUTHOR

...view details