ETV Bharat / priya

దిల్లీ మెచ్చిన 'కచాలు చాట్'.. ఆహా ఏమి రుచి

author img

By

Published : Jun 8, 2020, 1:09 PM IST

కరోనా వైరస్​ కారణంగా చిరుతిండ్లకు దూరమైన ఆహారప్రియులు చింతించనక్కర్లేదు. ఎందుకంటే ఇంట్లో ఉంటూ 'కచాలు చాట్'ను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

Home made Chaat Recipes Kachalu chaat
దిల్లీ మెచ్చిన 'కచాలు చాట్'.. ఆహా ఏమి రుచి

సాయంత్రమైతే చాలు ఆఫీసు​, పాఠశాలలు ముగించుకుని సహొద్యోగులు, స్నేహితులతో కలిసి వీధి బండ్ల వద్ద దొరికే న్యూడిల్స్​, చాట్​, పానీపూరీ వంటి చిరుతిండ్లను ఆరగించేసే వాళ్లం. కానీ ఇదంతా కరోనా రాక ముందు. ఒక్కసారిగా కరోనా రాకతో పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. ప్రస్తుతం వైరస్​ వ్యాప్తి భయాలతో కాస్త కష్టమైనా సరే ఈ అలవాట్లకు కొద్దికాలం చెక్​ పెట్టక తప్పలేదు. అయితేనేం.. మీకు ఇష్టమైన చిరుతిండ్లను ఇంట్లోనే ఉంటూ తయారు చేసుకోవచ్చు. దేశ రాజధానిలో అత్యంత ఆదరణ పొందిన చిరుతిండ్లలో ఒకటి 'కచాలు చాట్​'. దీనిని హిందీలో కచాలు లేదా ఆర్బీ అని అంటారు. మీ ఇంట్లోనే సులువుగా ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు..

  • చేమగడ్డ-250గ్రాములు
  • ఉప్పు, జీలకర్రపొడి-తగినంత
  • గరం మసాల-పావు టీస్పూన్
  • బ్లాక్​సాల్ట్-తగినంత
  • చాట్​మసాల-రెండు టీస్పూన్లు​
  • కారం-ఒక టీస్పూన్​
  • నిమ్మరసం-రెండు టీస్పూన్లు
  • గ్రీన్​ చెట్నీ, చింతపండు, కర్జూరం చట్నీ, సేవ్​ కొత్తిమీర, దానిమ్మ గింజలు.

తయారీ విధానం..

దిల్లీ మెచ్చిన 'కచాలు చాట్'.. ఆహా ఏమి రుచి

ముందుగా చేమగడ్డను బాగా కడిగి తగినంత నీరు పోసి ఉడకబెట్టాలి. తర్వాత దాని తొక్కతీసి ముక్కలుగా కోసుకోవాలి, ఓ పాత్రలో వేసి... పైన చెప్పిన పదార్థాలు తగినంత వేసుకోని బాగా కలపాలి. చివరిలో గ్రీన్​ చెట్నీ, చింతపండు, కర్జూరం చట్నీ, దానిమ్మ గింజలు పైన వేసి గార్నిష్ చేస్తే 'కచాలు చాట్' సిద్ధం. ఎలా తయారు చేయాలో చూశారు కదా.. ఇంకెందుకు ఆలస్యం మీరు ప్రయత్నించండి. ఎలా ఉందో మీ అభిప్రాయాలను ఈటీవీ భారత్​తో పంచుకోండి.

ఇదీ చూడండి: చలవనిచ్చే 'చాస్'.. తయారు చేయండి ఇలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.