తెలంగాణ

telangana

నోరూరించే 'ఆంధ్రా పూరీ కూర' ట్రై చేయండిలా..

By

Published : Aug 28, 2021, 5:22 PM IST

వెజ్​లోనూ కాస్త వెరైటీగా, నోరూరించే కూరను వండాలనుకుంటున్నారా? అయితే టేస్టీగా ఉండే 'ఆంధ్రా పూరీ కూర' ట్రై చేయండి మరి.

andhra poori koora
ఆంధ్రా పూరీ కూర

ఎప్పుడూ నాన్​ వెజ్​ వెరైటీలే కాకుండా అప్పుడప్పుడు వెజ్​లోనూ భిన్నంగా కూరలు వండాలి అనుకుంటాం. కానీ, ఏం వండాలో అర్థం కాదు. అందుకే ఈ 'ఆంధ్రా పూరీ కూర'ను ఈసారి ట్రై చేయండి.

కావాల్సినవి..

బంగాళదుంపలు, పచ్చిమిర్చి పేస్ట్, ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, పసుపు, కరివేపాకు, ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, బఠానీలు, టమాట ముక్కలు, శనగపప్పు, శనగపిండి.

తయారీ విధానం..

ముందుగా గిన్నెలో నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, కరివేపాకు, పసుపు వేయాలి. ఆ తర్వాత కాస్త పెద్దగా కోసిన ఉల్లిపాయ ముక్కలను గిన్నెలో వేయాలి. ఉల్లిపాయలు ఎన్ని ఎక్కువగా వేస్తే కూర అంత రుచిగా ఉంటుంది. ఇవి కాస్త వేగిన తర్వాత అందులో ఉప్పు, క్యారెట్ ముక్కలు వేయాలి. 15 నిమిషాల పాటు ఆ ముక్కలను బాగా మగ్గించి.. బఠానీలు, టమాట ముక్కలతో పాటు నానబెట్టిన శనగపప్పు, బంగాళదంప ముక్కలు వేయాలి. తగినన్ని నీళ్లు పోసి.. పచ్చిమిర్చి పేస్ట్​ను అందులో కలపి 15 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత శనగపిండి కలపాలి. 5 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఉడికిస్తే ఆంధ్రా పూరీ కూర రెడీ.

ఇదీ చూడండి:చేప పులుసు ఇష్టమా..? ఇలా ట్రై చేయండి!

ABOUT THE AUTHOR

...view details