ETV Bharat / priya

చేప పులుసు ఇష్టమా..? ఇలా ట్రై చేయండి!

author img

By

Published : Aug 27, 2021, 4:00 PM IST

మనసుకు నచ్చినప్పుడు.. చికెనో, మటనో కాకుండా చేపలు తెచ్చుకుంటే.. కాస్త వెరైటీగా ఏదో ఒకటి చేయాలనుకోవడం సహజమే. అయితే కాస్త వెరైటీగా ఉండే.. 'చేప ఉండల మామిడి పులుసు'ను ఈసారి ట్రై చేయండి. అది ఎలా చేయాలో ఇది చదివేయండి.

Verity Fish broth recipe with mangos
చేప ఉండల మామిడి పులుసు

నాన్​వెజ్ ప్రియులకు చికిన్​, మటన్​ తిని బోరు అనిపించినప్పుడు.. వారి దృష్టి చేపలమీదకు వెళ్తుంది. చేపలతో పులుసు, వేపుడు సహా పలు రకాల వంటకాలు చేసుకోవచ్చు. అయితే కాస్త వెరైటీగా చేయాలనుకున్నప్పుడు.. ఏం చేయాలో ఒక్కోసారి తెలియదు. అందుకే ఈ 'చేప ఉండల మామిడి పులుసు'ను ఈ సారి ట్రై చేయండి.

కావాల్సినవి

బోన్​లెస్​ చేపముక్కలు, ఉప్పు, పసుపు, కారం, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, వేయించిన ఉల్లిపాయలు, పచ్చికోడిగుడ్డు, ధనియాలు, మెంతులు, ఎండుమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, చింతపండు.

తయారీ విధానం

ముందుగా ఓ బేసిన్​లో బోన్​లెస్​ చేపముక్కలు, ఉప్పు, పసుపు, కారం, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, వేయించిన ఉల్లిపాయలు, పచ్చికోడిగుడ్డు వేసి బాగా రుబ్బుకోవాలి. అలాగే ధనియాలు, మెంతులు వేయించి.. పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

తర్వాత గిన్నెలో నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి, కాస్త వేగిన తర్వాత పల్చగా కోసుకున్న మామిడికాయ ముక్కలు, నానబెట్టిన వెండిమిర్చి పేస్ట్​, చింతపండు పులుసు వేసి ఐదు నిమిషాలు మగ్గించి.. తగినన్ని నీళ్లు, ముందుగా చేసుకున్న మసాలా పొడి వేసి ఒక ఉడుకు వచ్చేదాక వేడి చేయాలి. తర్వాతా ముందుగా రుబ్బుకున్న చేపల మిశ్రమాన్ని ఉండలాగా చేసి.. ఉడుకుతున్న మిశ్రమంలో వేసి 10 నిమిషాలు ఉడికించాలి. ఆ పులుసును దించే ముందు.. పైన కొత్తిమీర జల్లుకుంటే.. చేప ఉండల మామిడి పులుసు రెడీ.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: సాయంత్రం వేళ.. 'చికెన్​ కీమా పరోటా' చేసేయండిలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.