ETV Bharat / priya

సాయంత్రం వేళ.. 'చికెన్​ కీమా పరోటా' చేసేయండిలా?

author img

By

Published : Aug 26, 2021, 4:01 PM IST

పరోటా అనగానే గుర్తొచ్చేది ఆలూ పరోటా. అయితే చికెన్​తో కూడా ఎంతో రుచికరమైన పరోటాను తయారు చేసుకోవచ్చు. హోటళ్లోలో మాదిరిగానే 'చికెన్​ కీమా పరోటా'ను(Chicken keema Parotta) టెస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం.

Chicken keema Parotta
చికెన్​ కీమా పరోటా

చికెన్​తో ఎన్నో వెరైటీలు చేయవచ్చు. మరెన్నో రుచులు తయారు చేసుకోవచ్చు. అలాంటి వెరైటీ వంటకమే.. 'చికెన్​ కీమా పరోటా'(Chicken keema Parotta). దీనిని వంటిట్లో అందుబాటులో ఉండే సాధారణ పదార్థాలతో హోటల్​ టేస్ట్​తో తయారు చేసుకోవచ్చు. అదేలాగో మీరే చూసి.. చేసేయండి. చల్లని సాయంత్రం వేళలో లొట్టలేసుకుంటూ తినేయండి.

కావాల్సినవి

చికెన్​ కిమా, మైదా పిండి, ఉల్లిపాయలు, కార్న్​​ఫ్లోర్​, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లి పేస్ట్​, నెయ్యి, కారం, పెరుగు, కొత్తిమీర, పసుపు, కరివేపాకు, నిమ్మకాయలు, మిరియాలు పొడి.

తయారీ విధానం..

ముందుగా చికెన్​ కీమాను ఉప్పునీటిలో శుభ్రంగా కడగాలి. తర్వాత చికెన్​ కీమాలో కార్న్​​ఫ్లోర్, ఉప్పు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కొత్తిమీర, పసుపు, మిరియాలు పొడి, కారం, కరివేపాకు, నిమ్మరసం వేసి అన్ని కలిసేలా కలపాలి. ఓ అరగంట వాటిని పక్కన పెట్టాలి.

మరో పాత్రలో మైదాపిండి తీసుకుని ఉప్పునీళ్లు వేసి కలుపుకోవాలి. మరి చపాతీ ముద్దలా కాకుండా ఉప్పునీళ్లు ఎక్కువ వేసి కొంచెం పల్చగా చేసుకోవాలి.

తర్వాత నూనె, ఉల్లిపాయ ముక్కలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్​, ఉప్పు, పసుపు వేసి తాళింపు పెట్టుకోవాలి. అందులో ముందుగా కలుపుకున్న చికెన్​ కీమాను వేసి బాగా వేపుడు చేయాలి. అనంతరం మైదాడోలో వేపుడు చేసిన చికెన్​ కీమాను వేసి రోటీలా చేయాలి. తర్వాత దానిని నెయ్యిలో ఫ్రై చేయాలి. అంతే చికెన్​ కీమా పరోటా రెడీ.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: NON VEG: మేక/కోడి కోసిన 3 గంటల్లోనే వండేయాలి.. లేదంటే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.