తెలంగాణ

telangana

యజమాని కుమారుడి చేతిలో కిరాతకానికి గురైన బాలిక మృతి

By

Published : Oct 16, 2020, 5:28 AM IST

ఖమ్మంలో యజమాని కుమారుడి కిరాతకానికి గురైన 13 ఏళ్ల బాలిక నెల పాటు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచింది. కాలిన గాయాలతో చికిత్స పొందుతూ గురువారం.. హైదరాబాద్​లో మృతి చెందింది. నిందితుడు అల్లం మారయ్యకు కోర్టు 14 రోజుల రిమాండ్​ విధించింది.

The khammam girl who were raped by the owner's son is dead
యజమాని కుమారుడి చేతిలో కిరాతకానికి గురైన బాలిక మృతి

ఖమ్మంలో యజమాని కుమారుడి కిరాతకానికి గురైన 13 ఏళ్ల బాలిక హైదరాబాద్​లో గురువారం మృతి చెందింది. స్థానిక పార్శీబంధం ప్రాంతంలో అల్లం సుబ్బారావు ఇంట్లో పనిచేసే బాలికపై కన్నేసిన అతడి కుమారుడు మారయ్య గత నెల 19న అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. లొంగకపోవడంతో పెట్రోల్​ పోసి నిప్పంటించాడు. కాలిన గాయాలకు గురైన బాధితురాలు నెల పాటు మృత్యువుతో పోరాడింది.

మొదట ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమెకు రహస్యంగా చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఆమె తల్లిందండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. హైదరాబాద్​ తరలించారు. వారం నుంచి అక్కడ చికిత్స పొందుతున్న ఆమె గురువారం తుదిశ్వాస విడిచింది. నిందితుడు అల్లం మారయ్యకు కోర్టు 14 రోజుల రిమాండ్​ విధించింది.

ఇదీ చూడండి: జూరాలకు భారీగా వరద ప్రవాహం

ABOUT THE AUTHOR

...view details