తెలంగాణ

telangana

కుటుంబ కలహాలతో బైక్​తోపాటు చెరువులో దూకి ఆత్మహత్య

By

Published : Oct 3, 2020, 4:52 PM IST

కుటుంబ తగాదాలతో ఆవేదన చెందిన ఓ వ్యక్తి బైక్​తో సహా చెరువులోకి దూకి తిరిగిరాని లోకాలకు చేరాడు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా వడ్డేపల్లి చెరువులో చోటుచేసుకుంది.

Suicide by jumping into a pond with a bike at waddepally warangal urban
బైక్​తోపాటు చెరువులో దూకి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో చెరువులో దూకిి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ అర్బన్ జిల్లా వడ్డేపల్లిలో జరిగింది. చెరువులో బైక్ పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు కాజిపేట్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జాలర్లతో వెతికించగా మృతదేహం లభించింది. మృతుడు హన్మకొండకు చెందిన సప్తగిరిగా గుర్తించారు.

సప్తగిరి వారి ఉమ్మడి స్థలాన్ని విక్రయించినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. అందులో మృతుని వాటాగా 15 లక్షల వరకు నగదు అందినట్లు తెలిసింది. అట్టి నగదును మృతుడు ఇంట్లో ఇవ్వకపోవడం.. అతిగా మద్యం సేవిస్తుండడం వల్ల భార్యభర్తలకు తరచూ గొడవలు జరిగేవని ఆ క్రమంలోనే సప్తగిరి ఈరోజు మద్యం సేవించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆత్మహత్య చేసుకోవాలనే కారణంతో బైక్​తో సహ చెరువులోకి దూకి ఉంటాడని పోలీసులకు వెల్లడించారు. మృతదేహన్ని పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

ఇదీ చూడండి :గిఫ్ట్ ఏ స్మైల్​లో భాగంగా.. మంత్రి కేటీఆర్​కు ఆంబులెన్స్ అందజేత

ABOUT THE AUTHOR

...view details