ETV Bharat / state

గిఫ్ట్ ఏ స్మైల్​లో భాగంగా.. మంత్రి కేటీఆర్​కు ఆంబులెన్స్ అందజేత

author img

By

Published : Oct 3, 2020, 3:46 PM IST

రాష్ట్ర మంత్రి కేటీఆర్​ పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించిన గిఫ్ట్ ఏ స్మైల్​ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఇతరులకు సాయం చేసి వారి చిరునవ్వును కేటీఆర్​కు కానుకగా సమర్పించారు. ఇందులో భాగంగానే.. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆంబులెన్స్​ వాహనాన్ని ఐటీ మంత్రికి అందజేశారు.

mla narendar gifted an ambulance
మంత్రి కేటీఆర్​కు ఆంబులెన్స్ అందజేత

గిఫ్ట్ ఏ స్మైల్​ కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్​కు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆంబులెన్స్ వాహనాన్ని అందజేశారు. కరోనా బాధితులు, పేదలకు వైద్య సేవలు మరింత అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వాహనం అందజేసినట్లు ఎమ్మెల్యే నరేందర్ తెలిపారు.

ప్రగతి భవన్​లో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్​ జెండా ఊపి ఆంబులెన్స్​ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, శంకర్ నాయక్, ఎంపీ మాలోత్ కవిత, మేయర్ గుండా ప్రకాశ్ పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.