తెలంగాణ

telangana

ఆ అనుమానంతోనే తల్లిని కడతేర్చాడా..?

By

Published : Dec 27, 2020, 9:09 PM IST

తల్లి వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్నాడు. దానికి తోడు ఆమె ప్రవర్తన బాగోలేదని భావించాడు. చివరకు అంతమొందించాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నట్టుగానే చున్నీతో ఉరివేసి కడతేర్చాడు. పోలీసుల ముందు నేరాన్ని ఒప్పుకున్నాడు.

Son who killed mother on suspicion of extramarital affair
అనుమానంతో కన్నతల్లిని చంపిన తనయుడు

వివాహేతర సంబంధం పెట్టుకున్నదన్న అనుమానంతో ఓ తనయుడు తన కన్న తల్లిని కడతేర్చాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్​ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎల్లమ్మబండ జన్మభూమి కాలనీలోని మల్లమ్మను చున్నీతో ఉరివేసి ఆమె‌ కుమారుడు సురేష్ హత్య చేశాడు.

ప్రవర్తనతో విసిగి..

మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. తన తల్లి వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఆమె ప్రవర్తన బాగోలేక పోవటంతో హత్య చేశానని కుమారుడు తెలిపాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంబించారు.

ఇదీ చూడండి:'హత్య వెనుక కుట్రను వెలికి తీయండి.. కఠినంగా శిక్షించండి'

ABOUT THE AUTHOR

...view details