తెలంగాణ

telangana

ఆవుపై చిరుత దాడి: భయాందోళనలో గ్రామస్థులు

By

Published : Jan 2, 2021, 9:53 PM IST

నిర్మల్ జిల్లాలో చిరుత దాడి ఘటనలో ఓ ఆవు చనిపోయింది. గ్రామానికి సమీపంలో చిరుత సంచరిస్తుందని తెలిసి గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.

Leopard attack on a cow in nirmal district
ఆవుపై చిరుత దాడి: భయాందోళనలో గ్రామస్థులు

ఆవుపై చిరుత దాడి చేసిన ఘటన నిర్మల్ జిల్లా కుబీర్ మండలం జాంగావ్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. చిరుత సంచరిస్తుందని తెలిసి గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.

జాంగావ్ గ్రామానికి చెందిన షేక్ హుస్మన్​కు చెందిన ఆవు నిన్నటి నుంచి ఇంటికి రాలేదు. దీంతో ఊరంతా వెతికాడు. గ్రామానికి సమీపంలో ఆవు పడిపోయి కనిపించటంతో దగ్గరకు వెళ్లి చూడగా చనిపోయి ఉంది. ఆవు వెనుక భాగంలో, మెడపై చిరుత దాడి చేసిన ఆనవాళ్లు చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు ఆవు చుట్టు ఉన్న కాలి అడుగులు పరిశీలించి చిరుతనే దాడి చేసిందని నిర్ధారించారు. గ్రామస్థులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

ఇదీ చూడండి:రైతుబంధుతో రూ. 5,111 కోట్ల సాయం

ABOUT THE AUTHOR

...view details