తెలంగాణ

telangana

బాలికపై చిన్నమ్మ కర్కషం... దుస్తుల పేరుతో చిత్రహింసలు

By

Published : Nov 19, 2020, 12:06 PM IST

దుస్తులు కొనిస్తానని చెప్పి... బాలికను నిర్బంధించి... చిన్నమ్మ చిత్రహింసలు పెట్టిన ఘటన మిర్యాలగూడలో చోటు చేసుకుంది. భూవివాదం కారణంగానే కిడ్నాప్ జరిగినట్లు బాలిక తల్లి ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

girl kidnapped in miryalaguda by her relatives on land issue
బాలికను నిర్బంధించి చిత్రహింసలు పెట్టిన చిన్నమ్మ

బాలికను నిర్బంధించి చిత్రహింసలు పెట్టిన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈనెల 7న బట్టలు కొనిస్తానని చెప్పి... బాలిక చిన్నమ్మ తన స్నేహితునితో కలిసి తీసుకెళ్లి గదిలో బంధించిందని బాలిక తల్లి తెలిపింది.

11 రోజుల తర్వాత బాలిక ఇంటి సమీపంలో వదిలేసినట్లు వెల్లడించింది. భూవివాదం కారణంగానే కిడ్నాప్‌ చేసినట్లు ఆమె భావిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నామని చెబుతున్నా... నిందితులను ఇంకా పట్టుకోవడంలేదని బాలిక తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ఇదీ చూడండి:కిడ్నాప్ చేశారా? అదృశ్యమయ్యారా?

ABOUT THE AUTHOR

...view details