తెలంగాణ

telangana

ఫోన్​లో ఆడొద్దని తల్లి మందలింపు... బాలుడు ఆత్మహత్య!

By

Published : Dec 17, 2020, 7:55 PM IST

స్మార్ట్​ ఫోన్లలో ఆటలకు అలవాటు పడి పిల్లలు బయటి ప్రపంచాన్నే మర్చిపోతున్నారు. వద్దని మందలిస్తే చాలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఫోన్ కొనివ్వలేదని... ఫోన్ చూడనివ్వలేదని చాలామంది మంది ప్రాణాలు తీసుకున్నారు. సెల్​ఫోన్ ఆటలు మరో ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ఫోన్​లో ఆడనివ్వలేదనే మనస్తాపంతో ఓ బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

boy-suicide-for-smart-phone-in-hyderabad
ఫోన్​లో ఆడొద్దని తల్లి మందలింపు... బాలుడు ఆత్మహత్య!

హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని హాఫీజ్‌ బాబానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. సెల్​ఫోన్‌లో ఆడనివ్వడం లేదని మనస్తాపంతో ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాఫీజ్‌ బాబానగర్‌ సీ బ్లాక్‌లోని ఓ ఇంట్లో 15 ఏళ్ల ఇసాక్‌ చరవాణీలో ఆడుతుండడం వల్ల అతని తల్లి వద్దని మందలించింది. మనస్తాంపతో బాలుడు ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

కంచన్‌బాగ్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: తండ్రి చదువుకోమన్నాడని... ఆత్మహత్య చేసుకుంది

ABOUT THE AUTHOR

...view details