తెలంగాణ

telangana

సరదా కోసం వెళ్లడమే శాపమయ్యింది

By

Published : Jan 16, 2021, 8:55 PM IST

ఆడుకోవడానికి వెళ్లిన ఆ బాలుడికి అదే చివరి రోజు అయింది. పండగ పూట సరదాగా పశువులతో వెళ్లన ఓ బాలుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయాడు. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది.

boy fell into the pond and died in nirmal district
సరదాగా వెళ్లాడు.. తిరిగిరాని లోకాలకు పోయాడు

నిర్మల్ జిల్లా కుభీర్ మండలం బెల్గామ్ గ్రామంలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పదేళ్ల సూరజ్​ సరదాగా పశువులతో వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయాడు.

కనుమ రోజు (శుక్రవారం) సూరజ్ సరదాగా పశువులతో పాటు సమీప అటవీ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తూ చెరువుకు వెళ్లి స్నానం చేస్తుండగా.. ప్రమాదవశాత్తు నీళ్లలో పడి మునిగిపోయాడు. సమీపంలో ఉన్న వారు గమనించి బాలుడిని బయటకు తీశారు. స్థానిక ఆసుపత్రుకి తీసుకెళ్లేలోపే సూరజ్ చనిపోయాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు ఆర్ధాంతరంగా చనిపోవటంతో బాలుడి తలిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

ఇదీ చూడండి:పాము కాటుకు ఇంటర్​ విద్యార్థిని బలి

ABOUT THE AUTHOR

...view details