తెలంగాణ

telangana

భువనగిరిలో 40 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

By

Published : Dec 14, 2020, 10:23 AM IST

భువనగిరిలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

bhuvanagiri-police-caught-pds-rice-and-three-accused-taken-into-custody
భువనగిరిలో 40 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని అర్బన్ కాలనీలో ఓ వ్యానులో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ముగ్గురిని భువనగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు బొమ్మల రామారం మండలానికి చెందిన వారు కాగా... ఒకరు తుర్కపల్లి మండలానికి చెందిన వారిగా గుర్తించారు.

వారి నుంచి 40 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం, ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు భువనగిరి పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:జాతీయ రహదారిపై రెండు వాహనాలను ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details