తెలంగాణ

telangana

ఇళ్లు ఖాళీ చేయాలని తాలిబన్ల హుకుం- తిరగబడ్డ జనం

By

Published : Sep 15, 2021, 5:19 PM IST

మూడు రోజుల్లో ఇళ్లు ఖాళీ చేయాలంటూ తాలిబన్లు ఇచ్చిన ఆదేశాలపై (Taliban Kandahar) కాందహార్ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. 20 ఏళ్లగా తాము ఇక్కడే ఉంటున్నామని.. ఇప్పుడు తాలిబన్లు తమను ఖాళీ చేయమనడం సరికాదని అంటున్నారు.

Taliban Kandahar
తాలిబన్లకు వ్యతిరేకంగా కాందహార్​ ప్రజల నిరసన

తాలిబన్లకు వ్యతిరేకంగా అఫ్గానిస్థాన్​లోని కాందహార్​లో (Taliban Kandahar) వేల సంఖ్యలో ప్రజలు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయమని ఆదేశాలు జారీ చేయడమే అందుకు కారణం. సైన్యానికి చెందిన భూముల్లో నివాసం ఉంటున్న వారు మూడు రోజుల్లోగా (taliban news) ఖాళీ చేయాలని తాలిబన్లు ఆదేశించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

'మేము గత 20 ఏళ్లగా ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నాము. ఇది ప్రభుత్వ స్థలం అన్న విషయం నిజమే. కానీ మేము ఇక్కడ ఇళ్లు కట్టుకున్నాం. ఉన్నపళంగా తాలిబన్లు మమ్మల్ని ఇళ్లు ఖాళీ చేయమనడం సరి కాదు' అని నిరసనకారులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి :Mullah Baradar: ప్రభుత్వ కూర్పు నచ్చకే బరాదర్‌ అజ్ఞాతవాసం!

ABOUT THE AUTHOR

...view details