తెలంగాణ

telangana

'నాకేం కాలేదు..' తాలిబన్ల ఉపప్రధాని క్లారిటీ

By

Published : Sep 13, 2021, 9:33 PM IST

తాను చనిపోయానంటూ జరుగుతున్న ప్రచారాన్ని అఫ్గానిస్థాన్‌ ఉపప్రధాని అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ ఖండించారు. ఇందుకు సంబంధించి ఓ ఆడియోను విడుదల చేశారు. ప్రస్తుతం తాను ఉన్న చోట క్షేమంగా ఉన్నట్లు (afghan taliban) బరాదర్‌ ఆ ఆడియోలో తెలిపారు.

తాలిబన్ల ఉపప్రధాని క్లారిటీ.. క్షేమంగా ఉన్నట్లు ప్రకటన

తాలిబన్‌ సహ-వ్యవస్థాపకుడు, అఫ్గానిస్థాన్‌ ఉపప్రధాని అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ (afghan taliban) తాను చనిపోయానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను క్షేమంగా ఉన్నట్లు ఓ ఆడియో విడుదల చేశారు. తాను చనిపోయినట్లు మీడియాలో ప్రచారం జరుగుతోందన్న బరాదర్‌ కొన్నిరోజులుగా తాను ప్రయాణాలకు దూరంగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం తాను ఉన్న చోట క్షేమంగా ఉన్నట్లు బరాదర్‌ ఆ ఆడియోలో తెలిపారు.

గతవారం ముల్లా మహ్మద్‌ హసన్‌ అఖుంద్‌ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగా బరాదర్‌ ఉప ప్రధానిగా నియమితులయ్యారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి అధ్యక్ష భవనంలో తాలిబన్‌ వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో బరాదర్‌ గాయపడినట్లు లేదా చనిపోయినట్లు సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున ప్రచారం జరిగింది.

ఇదీ చూడండి :చనిపోయాడనుకున్న అల్​ఖైదా చీఫ్​ ప్రత్యక్షం.. ఎలా?

ABOUT THE AUTHOR

...view details