తెలంగాణ

telangana

అమెరికా అమ్ములపొదిలో ఆరోతరం బాంబర్.. ప్రపంచంలోనే అత్యుత్తమం!

By

Published : Dec 1, 2022, 7:40 AM IST

అమెరికా అమ్ములపొదిలోకి అత్యుత్తమ యుద్ధ విమానం చేరనుంది. ఇప్పటివరకు నిర్మించిన వాటిలో ప్రపంచంలోనే అత్యాధునిక సైనిక బాంబర్ ఇదేనని దాని తయారీ సంస్థ చెబుతోంది.

America's advanced fighter jet
ప్రపంచంలోనే అత్యుత్తమ సైనిక బాంబర్

అమెరికా అమ్ములపొదిలో ఇప్పటివరకు ఉన్న అత్యుత్తమ స్టెల్త్‌ బాంబర్‌ యుద్ధ విమానం బి-2 స్పిరిట్‌. దీని స్థానంలో అత్యాధునిక బి-21 రైడర్లు త్వరలో చేరనున్నాయి. "ప్రపంచంలోనే ఇప్పటివరకు నిర్మించిన అత్యాధునిక సైనిక బాంబర్‌ విమానం ఇదే" అని దీన్ని తయారుచేసిన నాథ్రాప్‌ గ్రమ్మన్‌ సంస్థ పేర్కొంది. ఆరో తరానికి చెందిన ఈ స్టెల్త్‌ బాంబర్‌ విమానాన్ని ఆ సంస్థ శుక్రవారం కాలిఫోర్నియాలో ఆవిష్కరించనుంది.

ఒక్కో బి-21 రైడర్‌ ఖరీదు సుమారు రూ.16,200 కోట్లు. ప్రారంభంలో మొత్తం ఆరు రైడర్లను ఈ సంస్థ తయారు చేయనుంది. 2023లోపు ఇవి అమెరికా సైన్యంలో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉంది. సంప్రదాయ, అణ్వాయుధాలతో పాటు.. భవిష్యత్తులో వినియోగంలోకి రానున్న లేజర్‌ ఆయుధాలనూ ప్రయోగించే సామర్థ్యం ఈ బి-21 రైడర్ల ప్రత్యేకత. ప్రత్యర్థులకు చిక్కకుండా.. దొరకకుండా ప్రపంచంలో ఏ లక్ష్యాన్నైనా ఇవి ఛేదించగలవు.

ABOUT THE AUTHOR

...view details