తెలంగాణ

telangana

హోటల్​పై ఉగ్రవాదుల దాడి.. 9 మంది మృతి.. 47 మందికి గాయాలు

By

Published : Oct 24, 2022, 7:26 AM IST

Updated : Oct 24, 2022, 7:34 AM IST

సోమాలియాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఓ హోటల్​పై పేలుడు పదార్థాలు నింపిన కారుతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా.. 47 మంది గాయపడ్డారని స్థానిక మీడియా పేర్కొంది.

SOMALI hotel attack
సోమాలియాలో ఉగ్రదాడి

సోమాలియాలో మిలిటెంట్లు మళ్లీ రెచ్చిపోయారు. తీరప్రాంత నగరమైన కిస్మయోలో భీకర దాడికి తెగబడ్డారు. తొలుత పేలుడు పదార్థాలు నింపిన కారుతో హోటల్ గేటును ఢీకొట్టి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. అనంతరం కొందరు సాయుధులు హోటల్​లోకి ప్రవేశించారు. ఈ దాడిలో తొమ్మిది మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మృతుల్లో నలుగురు భద్రతా సిబ్బంది ఉన్నట్లు వెల్లడించింది. మరో 47 మంది గాయపడినట్లు తెలుస్తోంది.

ఈ దాడికి తమదే బాధ్యతని అల్-షబాబ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. రాజధాని మొగదిషుకు 500 కిలో మీటర్ల దూరంలో కిస్మయో నగరంలో ఉన్న ఈ హోటల్లో ఎక్కువగా ప్రభుత్వ అధికారులు సమా వేశం అవుతుంటారు. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో సన్నిహిత సంబంధాలు ఉన్న అల్ షబాబ్ ఉగ్రవాద సంస్థ సోమాలియాలో క్రమం తప్పకుండా విధ్వంసానికి పాల్పడుతోంది.

Last Updated :Oct 24, 2022, 7:34 AM IST

ABOUT THE AUTHOR

...view details