తెలంగాణ

telangana

యుద్ధం ఆపేలా రష్యాపై ఒత్తిడి..! పుతిన్​తో జిన్​పింగ్​ భేటీ

By

Published : Mar 20, 2023, 10:39 PM IST

Updated : Mar 20, 2023, 10:54 PM IST

రష్యా ప్రెసిడెంట్​ వ్లాదిమిర్​ పుతిన్ అహ్వానం మేరకు.. మూడు రోజుల పర్యటనలో భాగంగా మాస్కో చేరుకున్న షీ జిన్​పింగ్​కు ఘన స్వాగతం లభించింది. ఇరు దేశాల అధినేతల భేటీ అయి.. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఉక్రెయిన్​ యుద్ధం ముగించాలంటూ గత కొద్ద కాలంగా ఒత్తిడి తెస్తున్న చైనా ఒత్తిడి తెస్తోంది. ఈ నేపథ్యంలో జిన్​పింగ్​ రష్యా పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

putin xi meeting 2023
putin xi meeting 2023

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు.. మాస్కోకు చేరుకున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఘన స్వాగతం లభించింది. 3 రోజుల పర్యటన నిమిత్తం రష్యా వెళ్లిన జిన్‌పింగ్.. పుతిన్‌తో ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. కాగా, ఉక్రెయిన్​​ యూద్ధాన్ని శాంతి చర్చలతో ముగించాలని డ్రాగన్​ గత కొంతకాలంగా యుద్ధ క్షేత్రంలో ఉన్న ఇరు దేశాలపై ఒత్తిడి తెస్తోంది. దీంతోపాటు ఇటీవల చైనా.. ఇరాన్, సౌదీ​ దేశాల మధ్య మధ్యవర్తిగా వ్యవహరించి.. ఇరు దేశాలు ఓ ఒప్పందానికి వచ్చేలా చేసింది. దీంతో ఇరాన్, సౌదీ బంధంలో మరో ముందడుగు పడింది. ఈ నేపథ్యంలో జిన్​పింగ్​.. పుతిన్​తో జరిపిన చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది. కాగా, ఈ చర్చలు మంగళవారం కూడ కొనసాగుతాయని రష్యా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆ తర్వాత ఇరు దేశాల ప్రతినిధులు చర్చల్లో పాల్గొంటారని వెల్లడించారు.

జిన్​పింగ్​ మాస్కో చేరుకున్నాక ఓ ప్రకటన విడుదల చేశారు. " ఏ విధమైన కూటమి లేకుండా, ఎలాంటి ఘర్షణ లేకుండా, మూడో పక్షాన్ని టార్గెట్​ చేయకుండా.. మా రెండు దేశాలు ద్వైపాక్షిక సంబంధాన్ని ఏర్పర్చుకున్నాయి. దేశాల మధ్య సంబంధాలు మెరుగు పడేందుకు కొత్త మోడల్​ను అభివృద్ధి చేయడంలో ఉదాహరణగా నిలిచాయి. ఐరాస చార్టర్ ప్రయోజనాలు, సూత్రాల ఆధారంగా అంతర్జాతీయ సంబంధాల ప్రాథమిక నిబంధనలను ద్వారా అంతర్జాతీయ క్రమాన్ని పరిరక్షించడంలో రష్యాతో కలిసి మేము పనిచేస్తాము." అని చెప్పారు.

అంతకుముందు ఉక్రెయిన్​ యుద్ధానికి సంబంధించి చైనా చేసిన ప్రతిపాదనలను పరిశీలించామని రష్యా అధ్యక్షుడు పుతిన్​ తెలిపారు. అధ్యక్షుడు జిన్​పింగ్​తో జరిగే సమావేశంలో దీనిపై చర్చిస్తానని చెప్పారు. ఈ మేరకు రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ నివేదించింది.'చర్చలకు మేము ఎప్పుడూ సిద్ధమే. ఈ సమస్యలన్నింటినీ చర్చిస్తాము. ఇలాంటి వ్యవహారాల్లో మీరు చూపించిన చొరవను గౌరవిస్తాము' అని పుతిన్​ అన్నారు.

రష్యా పర్యటన.. స్నేహం, సహకారం, శాంతి కోసమేనని జిన్‌పింగ్‌ వ్యాఖ్యానించినట్లు అంతకుముందు చైనా అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది. అయితే, ఆర్థిక వ్యవస్థ కుదేలైన చైనా.. చమురు, గ్యాస్‌ కోసం రష్యా వైపు చూస్తోంది. దీంతో ఈ పర్యటన పుతిన్- జిన్‌పింగ్‌ మధ్య స్నేహపూర్వక సంబంధాలు మరింత బలోపేతానికేనని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు.. యుద్ధనేరాల అభియోగాలు మోపిన నేపథ్యంలో ఆయనకు రాజకీయ ప్రోత్సాహం అందించేందుకు జిన్‌పింగ్.. రష్యా పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికా ఆధిపత్య ధోరణిని ఇరుదేశాలు వ్యతిరేకిస్తుండటంతో ఈ భేటీ ఆసక్తిగా మారింది.

Last Updated : Mar 20, 2023, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details