తెలంగాణ

telangana

బ్రిటన్​ ప్రధానమంత్రిగా లిజ్ ట్రస్.. నియమించిన క్వీన్​ ఎలిజబెత్​ 2

By

Published : Sep 6, 2022, 7:22 PM IST

Britain New Prime Minister : బ్రిటన్​ కన్జర్వేటివ్‌ పార్టీ అధ్యక్షురాలిగా లిజ్​ ట్రస్​ విజయం సాధించారు. ప్రత్యర్థి భారత సంతతికి చెందిన రిషి సునాక్​పై గెలుపొంది బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. తాజాగా బ్రిటన్​ రాణి ఎలిజబెత్​ 2.. లిజ్​ను అధిరికంగా ప్రధానమంత్రిగా నియమించారు.

liz truss prime minister
liz truss officially appointed as britain new prime minister by queen elizabeth 2

Britain New Prime Minister : బ్రిటన్‌లో కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా విజయం సాధించిన లిజ్‌ ట్రస్‌ ఆ దేశ ప్రధానిగా అధికారికంగా నియమితులయ్యారు. బ్రిటన్‌ క్వీన్‌ ఎలిజబెత్‌ 2, నూతన ప్రధానమంత్రిగా లిజ్‌ ట్రస్‌ను నియమించారు. స్కాట్లాండ్‌లోని బాల్మోరల్‌ క్యాజిల్‌లో ఉన్న రాణి ఎలిజబెత్‌తో లిజ్‌ ట్రస్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బ్రిటన్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రాణి ఎలిజబెత్‌ సూచించడంతో అందుకు ట్రస్‌ అంగీకరించారు. అంతకుముందు క్వీన్‌ను కలిసిన బోరిస్‌ జాన్సన్‌.. తన రాజీనామాను అందజేశారు.

ఇదిలాఉంటే, అధికార కన్జర్వేటివ్‌ పార్టీలో అంతర్గతంగా చేపట్టిన నాయకత్వ ఎన్నికలో విదేశాంగమంత్రిగా ఉన్న లిజ్‌ ట్రస్‌ విజయం సాధించింది. తన ప్రత్యర్థి, భారత సంతతికి చెందిన మాజీ ఆర్థికమంత్రి రిషి సునాక్‌పై ఆమె గెలుపొందారు.
భారత సంతతికి చెందిన రిషి సునాక్‌, లిజ్‌ ట్రస్‌కు మధ్య హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆమెకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటూ సర్వేలన్నీ ఘంటా పథంగా చెబుతూ వచ్చాయి. సర్వేల అంచనాలను నిజం చేస్తూ మార్గరెట్‌ థాచర్‌, థెరిసా మే తర్వాత బ్రిటన్‌ పగ్గాలు చేపట్టిన మూడో మహిళా ప్రధానిగా 47 ఏళ్ల లిజ్‌ రికార్డు సృష్టించారు.

ఈ ఎన్నికల్లో లిజ్‌ ట్రస్‌కు 81,326 ఓట్లు రాగా.. రిషి సునాక్‌కు 60,339 ఓట్లు వచ్చాయి. దీంతో దాదాపు 21 వేల ఓట్ల తేడాతో సునాక్‌పై లిజ్‌ పైచేయి సాధించారు. బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన సందర్భంగా లిజ్‌ ట్రస్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తనకు ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తాను ప్రజల ప్రధానిగా ఉంటానని ప్రకటించారు. వచ్చే రెండేళ్లలో పన్నులు తగ్గించి ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసేందుకు ధైర్యమైన ప్రణాళికలను అందిస్తానన్నారు. ఇంధన సంక్షోభాన్ని పరిష్కరించనున్నట్టు తెలిపారు.

ఇవీ చదవండి:పుతిన్, కిమ్ దోస్తీ.. ఆయుధాల కోసం రష్యా.. సంబంధాల బలోపేతం కోసం కొరియా

చైనాలో భూకంప విధ్వంసం.. 65 మంది మృతి.. వందల మందికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details