తెలంగాణ

telangana

డ్రోన్లు కూల్చేసిన ఇజ్రాయెల్.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు

By

Published : Jul 3, 2022, 1:00 PM IST

Hezbollah drone Israel: లెబనాన్​ నుంచి ప్రయోగించిన మూడు మూడు హెజ్బొల్లా డ్రోన్లను ఇజ్రాయెల్‌ కూల్చేసింది. ఈ డ్రోన్లను తామే లెబనాన్‌ నుంచి ప్రయోగించినట్లు హెజ్బొల్లా కూడా అంగీకరించింది. దీంతో ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య కరిష్‌ గ్యాస్‌ క్షేత్రానికి సంబంధించిన యాజమాన్య హక్కులపై వివాదం కొనసాగుతోంది.

hezbollah drone israel
హెజ్బొల్లా డ్రోన్లు

Hezbollah drone Israel: తమ దేశానికి చెందిన చమురు రిగ్‌ దిశగా దూసుకొచ్చిన మూడు హెజ్బొల్లా డ్రోన్లను ఇజ్రాయెల్‌ కూల్చేసింది. ఈ ఘటన మధ్యధరా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతంలో చోటు చేసుకొంది. ఈ డ్రోన్లను తామే లెబనాన్‌ నుంచి ప్రయోగించినట్లు హెజ్బొల్లా కూడా అంగీకరించింది. దీంతో ఇజ్రాయెల్‌ - లెబనాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య కరిష్‌ గ్యాస్‌ క్షేత్రానికి సంబంధించిన యాజమాన్య హక్కులపై వివాదం కొనసాగుతోంది. దీనిని పరిష్కరించేందుకు అమెరికా దౌత్యవేత్త అమోస్‌ హాక్‌స్టన్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

మూడు హెజ్బొల్లా డ్రోన్లను కూల్చేసిన ఇజ్రాయెల్‌

ఈ గ్యాస్‌ క్షేత్రం ఐరాస కేటాయించిన విధంగా తమ ఎక్స్‌క్లూజివ్‌ ఎకనామిక్‌ జోన్‌ పరిధిలోకి వస్తుందని ఇజ్రాయెల్‌ వాదిస్తోంది. మరో వైపు లెబనాన్‌ కూడా ఈ గ్యాస్‌ క్షేత్రం తమదే అని చెబుతోంది. ఇజ్రాయెల్‌ ఆ గ్యాస్‌ క్షేత్రం నిర్వహించకుండా అవసరమైతే బలప్రయోగం చేయడానికి కూడా వెనుకాడమని గతవారం లెబనాన్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ దేశం చేపట్టిన నిఘా ఆపరేషన్‌లో భాగంగా ఈ డ్రోన్లను ప్రయోగించింది. తమ ఆపరేషన్‌ విజయవంతమైందని లెబనాన్‌ ప్రకటించింది.

ఈ ఘటనపై ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి బెన్ని గాంట్జ్‌ మాట్లాడుతూ.. సముద్ర సరిహద్దులపై ఓ ఒప్పందానికి రాకుండా హెజ్బొల్లా అడ్డుకుంటోందని ఆరోపించారు. ఈ ఒప్పందం లెబనాన్‌ శాంతి, సమృద్ధికి చాలా కీలకమని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌లో రాజకీయ అస్థిరత నెలకొన్న సమయంలో హెజ్బొల్లా దాడులు చేయడం గమనార్హం. గురువారం ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ రద్దుకు అనుకూలంగా చట్టసభ సభ్యులు ఓటింగ్‌ చేసిన విషయం తెలిసిందే. గత నాలుగేళ్లలో ఐదోసారి ఎన్నికకు ఆ దేశం సిద్ధమవుతోంది.

ఇవీ చదవండి:తనిఖీ చేసేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులు.. ముగ్గురు మృతి

86 ఏళ్ల వయసులో.. గిన్నిస్ రికార్డు సాధించిన బామ్మ

ABOUT THE AUTHOR

...view details