తెలంగాణ

telangana

బొగ్గు గని కంపెనీ ఆఫీస్​లో భారీ అగ్నిప్రమాదం- 26మంది మృతి

By PTI

Published : Nov 16, 2023, 11:52 AM IST

Updated : Nov 16, 2023, 5:23 PM IST

Fire At China Coal Mine Company Office : ప్రైవేట్​ బొగ్గు గనుల కంపెనీ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంలో 26మంది చనిపోయారు. చైనాలో జరిగిందీ ఘటన.

Fire At China Coal Mine Company Office
Fire At China Coal Mine Company Office

Fire At China Coal Mine Company Office :ఉత్తర చైనా.. షాంగ్సీ ప్రావిన్స్​లోని బొగ్గు గనుల కంపెనీ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంలో 26 మంది మరణించారు. మరో 38 మంది గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున 6.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ భవనం.. ఓ ప్రైవేట్ బొగ్గు గనుల కంపెనీకి చెందినదని చెప్పారు.

లియులియాంగ్​ నగరంలో ఉన్న ప్రైవేట్ యోంగ్జు బొగ్గు గని కంపెనీకి చెందిన భవనంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. భవనంలోని రెండో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలిపారు. ఈ కంపెనీ.. సంవత్సరానికి 120 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తుందని తెలిపారు.

చైనాలోని భవన సముదాయాలు, కర్మాగారాల్లో అగ్ని ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి. ఇక్కడ భద్రతా ప్రమాణాలు సరిగా అమలు చేయని కారణంగా తరచుగా పరిశ్రమలు, భవన సముదాయాల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. గతేడాది నవంబరులో అన్యాంగ్‌ నగరంలోని ఓ కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో 38 మంది చనిపోయారు. అంతకుముందు ఏడాది అక్టోబరులో షెన్‌యాంగ్‌లో జరిగిన పేలుడులో ముగ్గురు చనిపోగా.. 30 మంది గాయపడ్డారు. 2015లో టింజిన్‌లోని రసాయనాల గోదాముల్లో జరిగిన వరుస పేలుళ్లలో 175 మంది మృతి చెందారు. చైనాలోని కర్మాగారాల్లో జరిగిన అతిపెద్ద ప్రమాదాల్లో ఇది ఒకటి.

పునరావాస కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం, 32 మంది మృతి
Fire Accident In Iran Today :కొద్ది రోజుల క్రితం..ఉత్తర ఇరాన్​లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఇరాన్​ రాజధాని టెహ్రాన్​కు వాయవ్యంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్​రోడ్​ నగరంలోని ఓ ప్రైవేటు మాదకద్రవ్యాల బాధితుల పునరావాస కేంద్రంలో శుక్రవారం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 32 మంది మృతి చెందగా.. మరో 17 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. క్షతగాత్రులను నగరంలోని వివిధ ఆసుపత్రులకు తరలించామని అధికారులు తెలిపారు.

Last Updated :Nov 16, 2023, 5:23 PM IST

ABOUT THE AUTHOR

...view details