తెలంగాణ

telangana

బీచ్​లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. నలుగురు మృతి

By

Published : Jan 2, 2023, 1:52 PM IST

ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు హెలికాప్టర్లు పరస్పరం ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

Australia HELICOPTER-CRASH
Australia HELICOPTER-CRASH

ఆస్ట్రేలియాలో రెండు హెలికాప్టర్లు ఢీకొని బీచ్​లో పడ్డాయి. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బీచ్​లో సేదతీరుతున్న వారు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని అత్యవసర సేవలు అందించారు.

క్వీన్స్​లాండ్​ రాష్ట్రం గోల్డ్ కోస్ట్​లోని బీచ్ వద్ద ఉన్న 'సీ వరల్డ్' థీమ్ పార్క్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఓ హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా.. మరో హెలికాప్టర్ టేకాఫ్​కు యత్నించింది. ఈ క్రమంలోనే రెండు హెలికాప్టర్లు ఢీకొట్టాయి. అనంతరం ఓ హెలికాప్టర్ సురక్షితంగా సముద్రతీరంలోని ఇసుకపై ల్యాండ్ అయింది. కానీ మరో హెలికాప్టర్ మాత్రం తీవ్రంగా ధ్వంసమైంది. దాని విడిభాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. మృతులు సహా, తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు ప్రయాణికులు క్రాష్ అయిన హెలికాప్టర్​లో ఉన్నారు.

సిబ్బంది సహాయక చర్యలు

'ధ్వంసమైన హెలికాప్టర్​లో ఉన్న వారిని రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రాథమిక చికిత్స అందించి.. క్షతగాత్రులను ఆకాశమార్గంలో ఆస్పత్రికి తరలించారు' అని పోలీసులు తెలిపారు. రెండో హెలికాప్టర్ విండ్ షీల్డ్ పూర్తిగా ధ్వంసమైందని చెప్పారు. అందులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా.. వారికి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు.. ఆస్ట్రేలియా ట్రాన్స్​పోర్ట్ సేఫ్టీ బ్యూరో వెల్లడించింది.

ప్రమాద ప్రదేశం.. కుడివైపున సురక్షితంగా ల్యాండ్ అయిన హెలికాప్టర్
బీచ్​లో హెలికాప్టర్ శకలాలు

ABOUT THE AUTHOR

...view details