తెలంగాణ

telangana

మలేసియా ప్రధానిగా అన్వర్ ఇబ్రహీం.. హంగ్​ ఏర్పడినా..

By

Published : Nov 25, 2022, 6:50 AM IST

malaysia prime minister 2022

Malaysia New Prime Minister : మలేసియా ప్రధానమంత్రిగా అన్వర్​ ఇబ్రహీం ఎన్నికయ్యారు. ఆయనతో మలేసియా రాజు అల్‌ సుల్తాన్‌ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేయించారు.

Malaysia New Prime Minister : మలేసియాలో శనివారం జరిగిన ఎన్నికలు హంగ్‌ పార్లమెంటుకు దారితీసినా రాజు అల్‌ సుల్తాన్‌ అబ్దుల్లా పలువురు పార్లమెంటు సభ్యులతో సంప్రదించి గురువారం 75 ఏళ్ల అన్వర్‌ ఇబ్రహీంతో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అన్వర్‌ పార్టీ అలయన్స్‌ ఆఫ్‌ హోప్‌ 82 సీట్లు సాధించింది. 222 సీట్లు గల మలేసియా పార్లమెంటులో మెజారిటీ కావాలంటే 112 సీట్లు రావాలి.

అన్వర్‌ సంస్కరణవాది కాగా, మితవాది అయిన మాజీ ప్రధాని ముహియుద్దీన్‌ యాసిన్‌ పార్టీ నేషనల్‌ అలయన్స్‌కు 73 సీట్లు వచ్చాయి. 20 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి, జైలు శిక్షలు అనుభవించి, సంస్కరణల కోసం గట్టిగా నిలబడిన అన్వర్‌ పగ్గాలు చేపట్టడం వల్ల దేశంలో ఆశాభావం వెల్లివిరుస్తోంది. స్టాక్‌ మార్కెట్‌ సూచీలు, మలేసియా కరెన్సీ విలువ పెరిగాయి.

ABOUT THE AUTHOR

...view details