తెలంగాణ

telangana

సముద్రంలో కలుస్తున్న లావా.. అడ్డొచ్చినవన్నీ దగ్ధం!

By

Published : Sep 29, 2021, 3:22 PM IST

స్పెయిన్‌లోని కంబర్‌ వీజా అగ్నిపర్వతం తన విస్పోటనాన్ని (Spain Volcano Eruption) కొనసాగిస్తూనే ఉంది. భారీ ఎత్తున ఎగిసి పడుతున్న లావా.. లా పాల్మా దీవుల్లోని ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. నది ప్రవాహాన్ని తలపిస్తూ ఉబికి వస్తున్న లావా... సముద్రంలో కలుస్తుండటం భయాందోళనలను పెంచుతోంది. అగ్ని కీలలు చల్లటి నీటిలో కలవడం ద్వారా విషవాయువులు విడుదలై అక్కడి వారికి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

La Cumbre Vieja eruption
స్పెయిన్ లావా

గతవారం స్పెయిన్‌లో బద్దలైన లా పాల్మా దీవుల్లోని కంబర్ వీజా అగ్నిపర్వతం (La Palma Volcano) నుంచి అగ్నికీలలు ఎగసిపడుతూనే (Spain Volcano Eruption) ఉన్నాయి. 1971 తర్వాత మరోసారి బద్దలైన ఈ అగ్నిపర్వతం నుంచి లావా భారీగా (Spain Volcano Eruption 2021) బయటకు విడుదలవుతోంది. భగభగ మండుతున్న నదిని తలపిస్తున్న కంబర్‌ వీజా అగ్ని పర్వత లావా.. పాయలుగా వీడిపోయి దీవిలోని ఇళ్ల వైపునకు దూసుకెళ్తోంది. అడ్డొచ్చిన చెట్టు పుట్టా, గడ్డీ గాదం, ఇళ్లు రోడ్లను దహించేస్తూ ముందుకు సాగుతోంది. లావా దెబ్బకి దీవిలోని వందలాది ఇళ్లు ధ్వంసం అయ్యాయి. దాదాపు 6వేల మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

లావా ప్రవాహం
అగ్నిపర్వతం నుంచి ఎగసిపడుతున్న దట్టమైన బూడిద, లావా
అగ్నిపర్వతం

అయితే ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న లావా మంగళవారం నుంచి సముద్రంలో (La Cumbre Vieja eruption) కలుస్తుండటం తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. లావా నీటిలో కలవడం ద్వారా రసాయనిక చర్య జరిగి విషవాయువులు విడుదల అవుతున్నాయి. వేడి లావా చల్లటి సముద్ర నీటిలో కలిసినప్పుడు హైడ్రో క్లోరికామ్లం విడుదలవుతుందని అగ్నిపర్వత శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది వెంటనే వాయు రూపంలోకి రూపాంతరం చెందట వల్ల అగ్నిపర్వత శిథిలాలు గాల్లోకి విడుదలవుతాయని పేర్కొన్నారు. ఒకవేళ ఆ విషవాయువుని ఎవరైనా పీలిస్తే వారి చర్మం, కళ్లు మండటంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురుకావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

సముద్రంలో కలుస్తున్న లావా

మరోవైపు కరిగిన లావా సముద్రంలో... ఓ పెద్ద రాతిలాగా స్థిరపడిపోనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది ఒడ్డుకు వచ్చే పడవలకు ప్రమాదకరంగా మారొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2018 హవాయి తీరంలో లావా రాతిని పడవ ఢీకొట్టిన ఘటనలో 23మంది గాయపడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details