తెలంగాణ

telangana

Lockdown For Unvaccinated: మళ్లీ లాక్​డౌన్ ఖాయం! వారికి మాత్రమే!!

By

Published : Dec 4, 2021, 7:41 PM IST

Updated : Dec 4, 2021, 8:03 PM IST

Lockdown for unvaccinated people in these countries

Lockdown for unvaccinated people: కరోనా వ్యాప్తి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పుడు కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ రూపంలో ప్రపంచ దేశాల్లో వణుకు మొదలైంది. ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఇప్పటికే ఆయా దేశాలు అప్రమత్తం అయ్యాయి. లాక్​డౌన్​లు, కఠిన ఆంక్షలకు సిద్ధమయ్యాయి. ఈసారి కొత్తగా.. వ్యాక్సిన్​ తీసుకోనివారిని నిర్బంధంలో ఉంచుతున్నాయి. భారత్​లోనూ ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఏ దేశాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే?

Lockdown for unvaccinated people: కరోనా మహమ్మారి సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇప్పటికే భారత్​లోనూ రెండు వేవ్​లు చూశాం. లాక్​డౌన్​లు ఎదుర్కొన్నాం. అప్పటి పరిస్థితులు ఇంకా కళ్లముందు కదలాడుతున్నాయి. కొవిడ్​ పాజిటివ్​ వస్తే నిర్బంధం.. విదేశాలకు ప్రయాణాలు బంద్​.. టెస్టులు తప్పనిసరి వంటివి ఎన్నో చూశాం. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక కరోనా తగ్గుముఖం పట్టినట్లే.. సాధారణ జీవితం గడపొచ్చు అనుకుంటున్న తరుణంలో మళ్లీ ఒమిక్రాన్​ రూపంలో ముప్పు ముంచుకొంచింది.

మళ్లీ పలు దేశాలు కఠిన ఆంక్షలవైపు మళ్లుతున్నాయి. ఈసారి సరికొత్త రూపంలో లాక్​డౌన్​లకు సిద్ధమయ్యాయి. అవుతున్నాయి. ముఖ్యంగా కరోనా నుంచి రక్షగా భావిస్తున్న టీకా తీసుకోకుంటే ఉపేక్షించేదే లేదని తేల్చిచెబుతున్నాయి.

The Countries Locking Down the Unvaccinated: వ్యాక్సిన్​ తీసుకోనివారికి లాక్​డౌన్​లు విధిస్తున్నాయి. వారిని ప్రజా జీవితానికి దూరంగా ఉంచే ప్రయత్నం చేసి.. కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలని భావిస్తున్నాయి.

Covid in Europe: ఐరోపా దేశాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. అక్కడి చాలా ప్రభుత్వాలు ఈ దిశగా కొత్త నిబంధనలు​ తీసుకొచ్చాయి. ఏఏ దేశాల్లో ఎలాంటి ఆంక్షలు ఉన్నాయంటే..

జర్మనీ..

ఒమిక్రాన్​ వ్యాప్తిని తీవ్రంగా పరిగణించిన జర్మనీ.. వ్యాక్సిన్​ తీసుకోనివారికి లాక్​డౌన్​ విధించింది.

వ్యాక్సిన్​ వేయించుకునేందుకు జర్మనీలోని ఓ ఆరోగ్య కేంద్రం వద్ద లైన్లో నిల్చున్న జనం
  • వ్యాక్సిన్‌ తీసుకోని వ్యక్తులు.. సూపర్‌ మార్కెట్లు, బార్లు, రెస్టారెంట్లు, ఫార్మసీలు, థియేటర్లు, సినిమాహాళ్లు, క్రిస్​మస్​ మార్కెట్లతో పాటు పలు ముఖ్యమైన చోట్లలోకి ప్రవేశించకుండా నిషేధం ఉంది.
  • టీకా తీసుకోనివారు బయట తిరగడం కూడా నిషేధం.
  • జర్మనీలో రోజువారీ కేసులు ఇటీవల సగటున 70 వేల చొప్పున నమోదవుతున్నాయి.

టీకా తప్పనిసరి..

దేశంలో వ్యాక్సిన్​ తప్పనిసరి చేసేందుకు చట్టసభలో ఓ బిల్లు ప్రవేశపెట్టాలని అక్కడి ప్రభుత్వం చూస్తోంది. ఇది ఆమోదం పొందితే.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా అమల్లోకి వచ్చే అవకాశముంది.

ఆస్ట్రియా..

Austria introduces lockdown for unvaccinated

ఐరోపాలో అత్యంత తక్కువ వ్యాక్సినేషన్​ జరిగిన దేశం ఆస్ట్రియా. ఇక్కడ అర్హులైన 20 లక్షల మందికిపైగా ఇంకా వ్యాక్సిన్​ తీసుకోలేదు. ఇటీవల కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. అక్కడి ప్రభుత్వం కూడా వీరికి లాక్​డౌన్​ విధించింది.

  • వ్యాక్సిన్​ తీసుకోనివారికి అత్యవసరాలకు మాత్రమే బయటకు వెళ్లేందుకు అనుమతి ఉంటుంది.
  • కెఫే, రెస్టారెంట్లకు వెళ్లేందుకు వీల్లేదు.

దీంతో చాలా మంది.. వ్యాక్సిన్​ తీసుకునేందుకు ముందుకు వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. లాక్​డౌన్​ రూల్స్​ బ్రేక్​ చేసినవారికి పెద్ద మొత్తంలో జరిమానాలు(రూ.40వేల నుంచి రూ.లక్షా 30 వేల వరకు) విధిస్తున్నారు. వీరిని గుర్తించేందుకు ఆస్ట్రియా పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు.

ఆస్ట్రియా వియన్నాలో వ్యాక్సిన్​ తప్పనిసరి అన్న నిబంధనకు వ్యతిరేకంగా ఓ వ్యక్తి నిరసన

ఇటలీ..

  • ఇటలీలో ఆరోగ్య సిబ్బంది తప్పనిసరిగా టీకా తీసుకోవాల్సిందే. లేకుంటే ఉద్యోగం ఉండదు.
  • డిసెంబర్​ 6 నుంచి ఇటాలియన్లకు కొవిడ్​ గ్రీన్​ పాస్​ తప్పనిసరి.
  • కరోనా నుంచి కోలుకున్న లేదా వ్యాక్సిన్​ వేసుకున్నవారికి మాత్రమే ఇది లభిస్తుంది.
  • రైల్వే స్టేషన్లు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, జిమ్​లు, స్విమ్మింగ్​ పూల్స్​కు వెళ్లాలంటే ఇది చూపించాల్సిందే.
    ఇటలీలో క్రిస్​మస్​ మార్కెట్​లోకి ప్రవేశించేందుకు జనం వద్ద వ్యాక్సిన్​ సర్టిఫికెట్లు తనిఖీ చేస్తున్న అధికారులు

గ్రీస్​

Greece is Introducing Fines

  • 60 ఏళ్లు పైబడిన వారు.. తప్పనిసరిగా టీకా తీసుకోవాలని గ్రీస్​ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే సంబంధిత బిల్లుకు చట్టసభ్యులు ఆమోదం తెలిపారు.
  • దేశంలో 17 శాతం మందికిపైగా 60 ఏళ్లు పైబడినవారు వ్యాక్సిన్​ తీసుకోలేదట. వారికి భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించింది అధికార యంత్రాంగం.

స్పెయిన్​..

స్పెయిన్​ ప్రభుత్వం కూడా వ్యాక్సిన్​ తీసుకోని విదేశీ ప్రయాణికులను దేశంలోకి అనుమతించట్లేదు. టీకా తప్పనిసరి నిబంధనను స్పెయిన్​ కూడా తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

భారత్​..

పలు ఐరోపా దేశాల్లోలాగే భారత్​ కూడా టీకా తీసుకోనివారికి లాక్​డౌన్​ విధించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కర్ణాటక, కేరళ ప్రభుత్వాలు.. వ్యాక్సినేషన్​ సర్టిఫికెట్​ లేనివారిపై ఆంక్షలు విధిస్తున్నట్లు స్పష్టం చేశాయి.

  • కర్ణాటకలో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో రాష్ట్ర సర్కార్​ అప్రమత్తమైంది. బహిరంగ ప్రదేశాల్లో తిరిగే ప్రజలు తప్పనిసరిగా కొవిడ్ వ్యాక్సినేషన్​ సర్టిఫికెట్​ను చూపించాలని ఆదేశాలు జారీ చేసింది. ధ్రువపత్రాన్ని చూపించినవారినే షాపింగ్​ మాల్స్​లోకి అనుమతిస్తున్నారు.
    కర్ణాటకలో మాల్స్​లో కొవిడ్​ వ్యాక్సిన్​ సర్టిఫికెట్​ తనిఖీ చేస్తూ..
  • వ్యాక్సిన్​ తీసుకోని బోధన, బోధనేతర సిబ్బంది పట్ల కఠిన చర్యలు తీసుకోనున్నట్లు కేరళ విద్యాశాఖ స్పష్టం చేసింది. వారికి వేతనంలో కోత కూడా విధించనున్నట్లు మంత్రి వి. శివన్​ కుట్టి వెల్లడించారు.

ఆ దేశాల్లో కఠిన ఆంక్షలు..

ఐర్లాండ్​

Ireland closes clubs and puts new restrictions on bars

  • నైట్​క్లబ్​లు బంద్​, పబ్స్​, రెస్టారెంట్లు, హోటళ్లలో భౌతిక దూరం తప్పనిసరి.
  • జిమ్స్​, బీచ్​లు, పార్క్​లు, ఆటస్థలాల్లోకి వెళ్లాలంటే గ్రీన్​ పాస్ కావాల్సిందే. వ్యాక్సిన్​ తీసుకున్నవారికి ఇది సొంతం.

ఫ్రాన్స్​..

  • ఫ్రాన్స్​లో ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు.. తప్పనిసరిగా కరోనా టెస్టు చేయించుకోవాలి. వ్యాక్సిన్​ తీసుకున్నవారికి కూడా ఇది వర్తిస్తుంది.
  • జనవరి 15 నుంచి వయోజనులు​ అంతా.. బూస్టర్​ డోసు తీసుకోవాలి.
  • డిసెంబర్​ చివరి నుంచి 65 ఏళ్లు పైబడినవారికి హెల్త్​ పాస్​ తప్పనిసరి.

ఇవే కాక డెన్మార్క్​, నార్వే, పోర్చుగల్​, యూకే, బెల్జియం, నెదర్లాండ్స్​, చెక్​ రిపబ్లిక్​, స్వీడన్​, ఉక్రెయిన్​ వంటి ఐరోపా దేశాల్లోనూ కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి.

ఇవీ చూడండి: US Travel Rules: బైడెన్​ స్ట్రిక్ట్ రూల్స్- అమెరికా ప్రయాణం కాస్త కష్టమే!

టీకా తీసుకోనివారు బయట తిరగడం నిషేధం!

వ్యాక్సిన్ సర్టిఫికెట్​​ కోసం నకిలీ భుజం సృష్టించి.. అడ్డంగా బుక్కై...

Last Updated :Dec 4, 2021, 8:03 PM IST

ABOUT THE AUTHOR

...view details