టీకా తీసుకోనివారు బయట తిరగడం నిషేధం!

author img

By

Published : Dec 3, 2021, 5:48 AM IST

Updated : Dec 3, 2021, 6:43 AM IST

germany lockdown news

Germany Lockdown Unvaccinated: ఒమిక్రాన్ వేరియంట్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో కఠిన ఆంక్షలను అమలు చేయనుంది జర్మనీ. కరోనా టీకా తీసుకోనివారు బహిరంగ ప్రదేశాల్లో సంచరించడంపై నిషేధం విధించాలని నిర్ణయించింది.

Germany Lockdown Unvaccinated: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుండటం.. ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో టీకా తీసుకోని వారికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఆంక్షలు విధిస్తూ జర్మనీ నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్‌ పూర్తికాని వారు.. మార్కెట్‌లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో సంచరించడంపై నిషేధం విధిస్తున్నట్లు జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ప్రకటించారు.

జర్మనీలో ఇప్పటికే కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతుండగా కొత్తగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి టీకాలను తప్పనిసరి చేసేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ చట్టం పార్లమెంట్‌లో ఆమోదం తర్వాత.. వచ్చే ఫిబ్రవరి నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

మరోవైవు.. జర్మనీ జనాభాలో ఇప్పటివరకు 75శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.... దాదాపు 68శాతం మందికి మాత్రమే టీకాలు వేసింది.

ఇదీ చూడండి: విస్తరిస్తున్న 'ఒమిక్రాన్​'- భయం గుప్పిట్లో ఆ దేశాలు!

Last Updated :Dec 3, 2021, 6:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.