తెలంగాణ

telangana

అదిరే ఫీట్.. సొరంగాల్లో నుంచి దూసుకెళ్లిన విమానం

By

Published : Sep 6, 2021, 11:24 AM IST

ఇరుకైన సొరంగంలో నుంచి విమానాన్ని నడిపించడం అంటే మామూలు విషయం కాదు. చరిత్రలో ఎవరూ చేయని సాహసం అది. దీన్ని సుసాధ్యం చేసి చూపించారు ఇటలీకి చెందిన ఓ పైలట్. రెడ్​ బుల్ రేసింగ్ ప్లేన్ ద్వారా ఇటలీలోని రెండు సొరంగాల(airplane tunnel turkey) నుంచి ప్రయాణించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు.

turkey tunnel plane dario costa
సొరంగంలో విమానం

రేసింగ్ చరిత్రలో డేరియో కోస్టా(Dario Costa) తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. రెండు సొరంగాల లోపల నుంచి విమానాన్ని(aircraft tunnel) నడిపించి.. ఇప్పటివరకు ఎవరూ చేయని సాహసాన్ని చేశారు.

టన్నెల్​లో విమానం...

ఈ ప్రయోగం కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేసిన రెడ్​బుల్ రేసింగ్ విమానాన్ని(red bull plane tunnel) ఉపయోగించారు డేరియో. గంటకు 245 కి.మీ వేగంతో విమానాన్ని నడిపిస్తూ.. 43 సెకన్లలోనే 2.2 కి.మీల దూరం ప్రయాణించారు. టర్కీ(turkey tunnel flight) ఇస్తాం​బుల్​లోని శివార్లలో ఈ సాహసం చేశారు.

టన్నెల్ నుంచి బయటకు వస్తున్న విమానం

గిన్నిస్ దాసోహం

ఇరుకైన సొరంగం, విమానం చుట్టుపక్కల మూడు మీటర్లు మించని స్థలం... ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా విమానాన్ని సొరంగం దాటించారు. దీనికి గిన్నిస్ ప్రపంచ రికార్డు లభించింది.

"నా జీవితంలో ఎప్పుడూ టన్నెల్​లో విమానం ద్వారా ప్రయాణించలేదు. నేనే కాదు ఎవరూ చేయలేదు. కాబట్టి దీనిపై నాకు అనేక ప్రశ్నలు నా మదిలో మెదిలేవి. అనుకున్నది జరుగుతుందా లేదా అని ఆలోచించేవాడిని."

-డేరియో కోస్టా, ప్రొఫెషనల్ పైలట్

43 సెకన్లలోనే రేసు విజయవంతంగా ముగిసినా.. దీని వెనక ఏడాది శ్రమ ఉందని రెడ్ బుల్(red bull tunnel flight) వెల్లడించింది. సరైన ప్రణాళికతో దీన్ని చేపట్టేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపింది.

సొరంగ ప్రయాణం అనంతరం డేరియో కోస్టా

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details