తెలంగాణ

telangana

ఆడ ఏనుగుల మధ్య గొడవ- మగ గజం సయోధ్య!

By

Published : Jul 9, 2021, 10:46 AM IST

చైనా యూన్నాన్​ రాష్ట్రం అడవుల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా గుంపులోని రెండు ఆడ ఏనుగులు గొడవపడ్డాయి. నోటితో తోకలు పట్టుకుని, ఒకదాని వెనక ఒకటి పరిగెత్తి నానా హడావిడి చేశాయి. వాటి మధ్య సయోధ్యకు ఓ మగ ఏనుగు యత్నించిన తీరు ఆకట్టుకుంటోంది.

Viral video of 2 elephants engaged in a fight
ఏనుగుల గుంపులో గొడవ.. చివరికి!

ఆడ ఏనగుల గొడవ- మగ గజం సయోధ్య

ఇంట్లో పిల్లలుంటే ఆ సందడే వేరు. ఒకరిపై ఒకరు మీద పడి, కొట్టుకుని నానా హడావిడి చేస్తూ తల్లిదండ్రులకు కునుకు తీసే అవకాశాన్ని కూడా ఇవ్వరు. అమ్మ లేదా నాన్నా వారికి సద్దిచెప్పిన తర్వాత ఏమీ జరగనట్టు మళ్లీ కలిసిపోతారు. జంతువులూ ఇంతే! కొన్ని కొన్నిసార్లు మనిషికి ఏమాత్రం తీసిపోకుండా ప్రవర్తిస్తూ ఉంటాయి. చైనా ఏనుగుల గుంపునకు సంబంధించిన ఈ దృశ్యాలే ఇందుకు నిదర్శనం!

అచ్చం మనుషుల్లాగే!

యూన్నాన్​ రాష్ట్రంలోని షువాంగ్బన్న నేషనల్ నేచర్ రిజర్వ్ నుంచి తప్పించుకున్న ఏనుగుల గుంపు చేష్టలు నెట్టింట వైరల్​గా మారుతున్నాయి. తాజాగా.. ఓ గుంపులోని రెండు ఆడ ఏనుగులు గొడవపడ్డాయి. ఒకదాని వెంట మరోకటి పరిగెత్తి కొట్లాటకు దిగాయి. తోకలు నోట్లోపట్టుకుని నానా హడావిడి చేశాయి. ఆ తర్వాత ఓ మగ గజం మధ్యవర్తిత్వం చేసి వాటి మధ్య సయోధ్య కుదిర్చింది. రెండింటి మధ్య తన శరీరాన్ని అడ్డుపెట్టి సైగలు చేసింది.

అయితే గుంపులో ఆధిపత్యం కోసం ఆ రెండు ఏనుగులు గొడవ పడి ఉండొచ్చని గజరాజులను ఎప్పటికప్పుడు డ్రోన్లతో పర్యవేక్షిస్తున్న యూన్నాన్​ విశ్వవిద్యాలయం సభ్యులు వెల్లడించారు.

తప్పిపోయిన ఏనుగు చివరికి..

గుంపులోని ఓ ఏనుగు ఇటీవలే తప్పిపోయింది. దాని ఆచూకీని గుర్తించిన అధికారులు.. దానిని బంధించి, ట్రక్​ సహాయంతో నేచర్​ రిజర్వ్​కు తరలించారు.

ఇదీ చూడండి:-viral: అడవిలో హాయిగా సేద తీరుతున్న ఏనుగులు

ABOUT THE AUTHOR

...view details