తెలంగాణ

telangana

శ్రీలంకలో మళ్లీ రాజపక్స ప్రభుత్వమే!

By

Published : Aug 6, 2020, 2:15 PM IST

శ్రీలంక పార్లమెంటరీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. భారీ భద్రత నడుమ 64 కేంద్రాల్లో ఓట్లను లెక్కిస్తున్నారు. శుక్రవారం ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. రాజపక్స సోదరులకే మళ్లీ ప్రజలు పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Sri Lanka
శ్రీలంక

శ్రీలంకలో 196 పార్లమెంటు స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 64 కేంద్రాల్లో భారీ భద్రత నడుమ ఓట్లను లెక్కిస్తున్నారు అధికారులు. లెక్కింపు పూర్తయ్యాక శుక్రవారం ఫలితాలు వెలువరించే అవకాశం ఉంది.

రాజపక్సకే అనుకూలం?

ఎన్నికల్లో రాజపక్స సోదరులకు అనుకూలంగానే ప్రజల తీర్పు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. శ్రీలంకలో ఈస్టర్ ఉగ్రదాడి తర్వాత దేశ భద్రత బాధ్యతల్ని సమర్థంగా నిర్వహించగల నాయకుడిగా అధ్యక్షుడు గొటబయ రాజపక్స గత నవంబర్​లో ఎన్నికయ్యారు.

ఆయన సోదరుడు, మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స 225 స్థానాల మెజారిటీతో ప్రధానమంత్రి అయ్యారు. వీరి కుటుంబం నుంచి మొత్తం నలుగురు సభ్యులు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. రాజపక్స పార్టీకి బలమైన మద్దతు ఉంది.

71 శాతం పోలింగ్ నమోదు..

కరోనా మహమ్మారి భయాల నేపథ్యంలో బుధవారం శాంతియుతంగా పోలింగ్ జరిగింది. మొత్తం 71 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలుత ఏప్రిల్​లోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో రెండు సార్లు వాయిదా పడ్డాయి.

ఇదీ చూడండి:చైనాలో కొత్తరకమైన అంటువ్యాధి​.. ఏడుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details