ETV Bharat / international

చైనాలో కొత్తరకమైన అంటువ్యాధి​.. ఏడుగురు మృతి

author img

By

Published : Aug 5, 2020, 9:45 PM IST

ఓ వైపు కరోనా మహమ్మారితోనే సతమతమవుతుంటే.. చైనాలో మరో కొత్త అంటువ్యాధి బయటపడింది. టిక్​ బార్న్​ వైరస్​ కారణంగా వ్యాప్తి చెందే వ్యాధితో ఇప్పటికే ఏడుగురు మృతి చెందినట్లు అక్కడి అధికారిక మీడియా తెలిపింది. మరో 60 మంది చికిత్స పొందుతున్నారు.

new infectious disease in China:
చైనాలో కొత్త అంటువ్యాధి

కరోనా మహమ్మారికి పుట్టినిల్లు చైనాలో మరో కొత్త అంటువ్యాధి​ బయటపడింది. టిక్​-బార్న్​ (గోమార్లు) వైరస్​తో కొత్త అంటువ్యాధి సోకి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మంది వైరస్​ బారినపడి చికిత్స పొందుతున్నట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది. ఈ వైరస్​.. మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

"ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో తూర్పు చైనాలోని జియాంగ్ఝు రాష్ట్రంలో 37 మంది ఎస్​ఎఫ్​టీఎస్​ వైరస్​బారిన పడ్డారు. ఆ తర్వాత తూర్పు చైనాలోని అన్​హూయ్​ రాష్ట్రంలో మరో 23 మందికి ఈ వైరస్​ సోకింది."

- మీడియా నివేదిక

జియాంగ్ఝు రాజధాని నాన్జింగ్​కు చెందిన ఓ మహిళ వైరస్​ బారినపడగా.. ఆమెలో జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ప్రారంభమయ్యాయని, శరీరంలో ల్యూకోసైట్​, రక్తంలో ప్లేట్​లెట్​లు క్షీణించినట్లు వైద్యులు గుర్తించారు. ఒక నెల రోజుల పాటు చికిత్స అందించిన తర్వాత ఆమెను డిశ్చార్జి చేశారు.

అయితే.. ఎస్​ఎఫ్​టీఎస్​ వైరస్​ కొత్తది కాదని.. 2011లోనే ఈ వైరస్​ను గుర్తించినట్లు మీడియా పేర్కొంది. బన్యావైరస్​ వర్గానికి చెందినదిగా పేర్కొంది.

టిక్స్​ (గోమార్లు)తో మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అటువ్యాధుల నిపుణులు బావిస్తున్నారు. టిక్ కాటు ద్వారానే ప్రధానంగా ఈ వైరస్​ వ్యాపిస్తుందని తెలిపారు. తగు జాగ్రత్తలు తీసుకుంటే భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు.

ఇదీ చూడండి: నోవావాక్స్‌ వ్యాక్సిన్​తో ఆశాజనక ఫలితాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.