తెలంగాణ

telangana

వక్రబుద్ధి మార్చుకోని పాక్- ఓఐసీలో కశ్మీర్ ప్రస్తావన

By

Published : Dec 23, 2021, 11:07 AM IST

Pakistan on Kashmir: పాకిస్థాన్ మరోసారి భారత్​పై తన అక్కసు వెళ్లగక్కింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ సమావేశంలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. కశ్మీర్ ప్రజలు అణచివేతకు గురవుతున్నారని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. వారికి సాయం చేసేందుకు ఏకీకృత ప్రణాళిక సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని ఓఐసీ దేశాలకు పిలుపునిచ్చారు..

KASHMIR OIC PAKISTAN
KASHMIR OIC PAKISTAN

Pakistan on Kashmir: అంతర్జాతీయ వేదికపై మరోసారి కశ్మీర్ ప్రస్తావన తీసుకొచ్చింది. ఓఐసీ(ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్) విదేశాంగ మంత్రుల సమావేశంలో కశ్మీర్​తో పాటు ఇజ్రాయెల్ సమస్యలను పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ లేవెనెత్తారు. అఫ్గానిస్థాన్ అంశంపై చర్చించేందుకు వీరు సమావేశమైనప్పటికీ.. ఈ భేటీ తర్వాత విడుదల చేసిన 'ఇస్లామిక్ డిక్లరేషన్​'లో ఇజ్రాయెల్ అంశాన్ని ప్రస్తావించారని ఇటలీ రాజకీయ నిపుణుడు సెర్గియో రెస్టెలీ తెలిపారు.

OIC meeting Kashmir

"అఫ్గానిస్థాన్ సంక్షోభానికి, ఇజ్రాయెల్​కు సంబంధం లేకపోయినప్పటికీ.. ఇస్లామిక్ డిక్లరేషన్​లో ఇజ్రాయెలే ముఖ్యమైన అంశంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అఫ్గాన్ అంశంపై డిక్లరేషన్​లో పెద్దగా వివరాలేవీ పేర్కొనలేదు. ఇస్లామిక్ అభివృద్ధి బ్యాంకు ద్వారా ఓ ట్రస్టు ఫండ్​ను ఏర్పాటు చేసి అఫ్గాన్​కు సాయం చేస్తామని చెప్పారు. ఓఐసీ దేశాలు ఈ బ్యాంకుకు నిధులు అందిస్తాయని తెలిపారు. అయితే, ఎవరెవరు, ఏ విధంగా నిధులు అందిస్తారనే విషయంపై డిక్లరేషన్​లో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు."

-సెర్గియో రెస్టెలీ, ఇటలీ రాజకీయ నిపుణుడు

'కశ్మీర్​లో అణచివేత'

ఇజ్రాయెల్​తో పాటు కశ్మీర్ అంశాన్నీ ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావించారు. భారతదేశ అంతర్గత విషయమైన కశ్మీర్​ గురించి.. అంతర్జాతీయ వేదికపై మాట్లాడారు. పాలస్తీనా, కశ్మీర్ ఒకే విధమైన సమస్యను ఎదుర్కొంటున్నాయని చెప్పుకొచ్చారు. ఈ రెండు ప్రాంతాల్లో అణచివేతకు గురవుతున్న ప్రజలకు సాయం చేయాలని ఐఓసీ దేశాలను కోరారు. ఇందుకోసం ఏకీకృత ప్రణాళికను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు.

కశ్మీరీలకు ఓఐసీ చాలా సహకారం అందిస్తోందని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసించారు. ఐరాస భద్రతా మండలి నిబంధనల ప్రకారం.. జమ్ము కశ్మీర్​పై తీర్మానం చేయాలని ఓఐసీ కార్యదర్శికి సిఫార్సు చేశారు. అయితే, డ్రాగన్​కు వంతపాడే ఇమ్రాన్.. చైనాలో వీగర్ల అణచివేతపై నోరుమెదపకపోవడం గమనార్హం.

ఇదీ చదవండి:జర్మనీ అబ్బాయి.. రష్యా అమ్మాయి.. భారత్​లో పెళ్లి

ABOUT THE AUTHOR

...view details