తెలంగాణ

telangana

అఫ్గాన్‌ విడిచి వెళ్లేందుకు.. 2వేల మంది జర్నలిస్టులు సిద్ధం!

By

Published : Aug 29, 2021, 9:24 PM IST

అఫ్గానిస్థాన్ నుంచి బయటపడేందుకు అక్కడి జర్నలిస్టులు తీవ్రంగా(journalists in afghanistan) ప్రయత్నిస్తున్నారు. దేశం నుంచి బయటపడేందుకు సహకరించాలని అంతర్జాతీయ జర్నలిస్టుల ఫెడరేషన్​కు అభ్యర్థనలు పెట్టుకుంటున్నారు. దాదాపు రెండు వేల మంది దరఖాస్తులు చేసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.

AFGHAN JOURNALIST
అఫ్గానిస్థాన్ జర్నలిస్టులు

అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత(afghanistan taliban news) అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో భయంతో వేల మంది పౌరులు దేశం విడిచి వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అక్కడి జర్నలిస్టులు కూడా అఫ్గాన్‌ను(journalists in afghanistan) వీడేందుకు సిద్ధమయ్యారు. ఇలా దాదాపు 2వేల మంది అఫ్గాన్‌ జర్నలిస్టులు దేశం విడిచి వెళ్తామంటూ అంతర్జాతీయ జర్నలిస్టుల ఫెడరేషన్‌(International Federation of Journalists)కు దరఖాస్తు చేసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. దీంతో వారిని కాబుల్‌ ఎయిర్‌పోర్టుకు సురక్షితంగా చేరుకునేలా రక్షణ కల్పించాలని కోరుతూ ఐఎఫ్‌జే తాలిబన్లను సంప్రదించింది.

అమెరికా, నాటో బలగాల ఉపసంహరణ తర్వాత అఫ్గాన్‌లో చోటుచేసుకుంటున్న పరిస్థితులతో యావత్‌ దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు తమ పౌరులను తరలించే ప్రక్రియ(afghan evacuation)ను ముగించగా.. మరికొన్ని దేశాలు ఆగస్టు 31నాటికి పూర్తి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.

15 మందికే ఆశ్రయం

ఈ నేపథ్యంలో అఫ్గాన్‌లో వివిధ మీడియా సంస్థలకు చెందిన 2వేల మంది సిబ్బంది ఇతర దేశాలకు తరలివెళ్లేందుకు ఐఎఫ్‌జేకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వారికి వీసాలు జారీ చేయాలని స్పెయిన్‌, ఫ్రాన్స్‌, మెక్సికో, ఇటలీ, జర్మనీ, బ్రిటన్‌, అమెరికా, కెనడాతో పాటు మరికొన్ని దేశాలకు ఐఎఫ్‌జే విజ్ఞప్తి చేసింది. అయితే, ఇలా ఒక్కో దేశం కేవలం 10 నుంచి 15 జర్నలిస్టులకు మాత్రమే ఆశ్రయం కల్పించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో విదేశాలకు వెళ్లాలనుకునే మీడియా ప్రతినిధులను ఎయిర్‌పోర్టుకు రాకుండా తాలిబన్‌ సైన్యం అడ్డుకుంటున్నట్లు ఐఎఫ్‌జే ఆరోపించింది. ఈ విషయంలో తాలిబన్లు సహకారం అందించాలని ఇంటర్నేషనల్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ తాలిబన్లకు విజ్ఞప్తి చేసింది.

ఇదిలాఉంటే, అఫ్గాన్‌లో తాలిబన్ల దాడులు ఎక్కువయ్యాయనే(taliban attack in afghanistan) వార్తలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. హింసాత్మక ఘటనలకు పాల్పడమంటూనే పౌరులు, మీడియా ప్రతినిధులతో పాటు ప్రముఖులపై దాడులకు పాల్పడుతున్నారు. పలు సందర్భాల్లో మీడియా ప్రతినిధులపై బెదిరింపులకు పాల్పడగా.. తాజాగా ఓ జానపద గాయకుడిని దారుణంగా హత్య చేశారు.

ఇదీ చదవండి:కాబుల్ ఎయిర్​పోర్టు సమీపంలో రాకెట్ దాడి- చిన్నారి మృతి

ABOUT THE AUTHOR

...view details