తెలంగాణ

telangana

వార్త పరిశ్రమల్లో ఫేస్​బుక్​ భారీగా పెట్టుబడులు!

By

Published : Feb 25, 2021, 9:57 AM IST

వార్త పరిశ్రమల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఫేస్​బుక్​ సిద్ధమైంది. రానున్న మూడేళ్లలో బిలియన్​ డాలర్లు ఈ రంగంలో పెట్టుబడిపెట్టనున్నట్లు వెల్లడించింది.

Facebook
వార్త సంస్థల్లో ఫేస్​బుక్​ భారీ పెట్టుబడులు!

సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్​.. గూగుల్​ అడుగుజాడల్లో నడుస్తోంది. వార్త పరిశ్రమల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. వచ్చే మూడేళ్లలో ఈ పరిశ్రమల్లో 1 బిలియన్‌ డాలర్లు పెట్టుబడిగా పెట్టాలని ప్రణాళికలు రచిస్తునట్లు ఆ సంస్థ వెల్లడించింది. సామాజిక మాద్యమాలు వార్త సంస్థల్లో పెట్టుబడి పెట్టే చట్టం విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం-ఫేస్‌బుక్‌ మధ్య వివాదం నెలకొన్న వేళ ఈ మేరకు ప్రముఖ సామాజిక దిగ్గజం స్పందించింది.

గూగుల్,‌ ఫేస్‌బుక్‌ సామాజిక వేదికల్లో కనిపించే తమ వార్తలకు చెల్లింపులు జరపాలని వార్త సంస్థలు డిమాండ్‌ చేస్తున్నాయి. 2018 నుంచి ఇప్పటివరకూ 600 మిలియన్‌ డాలర్లను వార్త సంస్థలకు చెల్లించినట్లు ఫేస్‌బుక్‌ తెలిపింది.

మరోవైపు వచ్చే మూడేళ్లలో ప్రచురణ సంస్థల్లో ఒక బిలియన్‌ డాలర్లకు పైగా పెట్టుబడి పెడతామని గత ఏడాది అక్టోబర్‌లోనే గూగుల్‌ వెల్లడించింది. ఇందులో భాగంగా కంటెంట్‌ లైసెన్సింగ్‌ విషయంలో ఆస్ట్రేలియా మీడియా సంస్థలతో ఒప్పందం చేసుకున్న గూగుల్‌ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మరో 500 కంపెనీలతో ఒప్పందం చేసుకునేందుకు సంప్రదింపులు జరుపుతోంది.

ఇదీ చూడండి:ఆస్ట్రేలియాలో 'ఫేస్‌బుక్' ‌- రాజీ కుదిరింది

ABOUT THE AUTHOR

...view details