తెలంగాణ

telangana

Afghan Taliban: టీవీ యాంకర్​ను లైవ్​లో గన్స్​తో బెదిరించిన తాలిబన్లు

By

Published : Aug 30, 2021, 10:42 AM IST

అఫ్గానిస్థాన్​లో ఓ టీవీ యాంకర్​ను తుపాకులతో బెదిరించి మరీ తమపై పొగడ్తల వర్షం కురిపించుకున్నారు తాలిబన్లు(Afghan Taliban). ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తాము మీడియా స్వేచ్ఛకు అడ్డురామని తాలిబన్లు ఇచ్చిన హామీ ఏమైందని నెటిజన్లు మండిపడుతున్నారు.

armed taliban forced tv anchor to praise them. video gone viral on social media
టీవీ యాంకర్​కు తాపాకులు ఎక్కు పెట్టి మరీ పొగిడించుకున్న తాలిబన్లు

అఫ్గానిస్థాన్​లో ఓ టీవీ యాంకర్​ను లైవ్​లో బెదిరించారు సాయుధ తాలిబన్లు(Afghan Taliban). అతని వెనకాల నిల్చుని తుపాకులు ఎక్కుపెట్టి తమను ప్రశంసించాలని బలవంతపెట్టారు. యాంకర్​ను భయపడొద్దని చెప్పి మరీ పొగిడించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. మీడియా స్వేచ్ఛకు విఘాతం కల్గించమని తాలిబన్లు(Taliban News) ఇచ్చిన హామీ ఏమైందని నెటిజన్లు మండిపడుతున్నారు.

ఈ వీడియోను ఇరానీ జర్నలిస్ట్​ మసీ అలినెజాద్ ట్విట్టర్​లో షేర్​ చేశారు.

'ఇది అరాచకం, టీవీ యాంకర్​ను బెదిరించి ఇస్లామిక్ ఎమిరేట్​​ పాలనలో అఫ్గానీలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తాలిబన్ ఉగ్రవాదులు ఎలా చెప్పిస్తున్నారో చూడండి. తాలిబన్​ అంటేనే భయానికి మారు పేరని లక్షలాది మంది మనస్సులో ఉంది. అందుకు ఇది మరో ప్రత్యక్ష సాక్ష్యం' అని పేర్కొన్నారు మసీ అలినెజాద్.

ఆగస్టు 15న అఫ్గాన్​ను(Afghan Crisis) తమ అధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకున్నారు. కాబుల్​లో(Kabul News) వారి కోసం ప్రతి ఇల్లు తిరిగి సోదాలు నిర్వహిస్తున్నారు. బంధువులు దొరికినా దాడులకు పాల్పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం టోలో న్యూస్ రిపోర్టర్, కెమెరామెన్​ను చితకబాదారు. జర్మనీ వార్తా సంస్థకు చెందిన ఓ రిపోర్టర్ బంధువును దారుణంగా హత్య చేశారు.

ఇదీ చూడండి:Afghan Crisis: పెనం పై నుంచి పొయ్యిలోకి..

ABOUT THE AUTHOR

...view details