తెలంగాణ

telangana

ఒమిక్రాన్ ఎలా పుట్టింది?.. ఎందుకంత ప్రమాదకరంగా మారింది?

By

Published : Nov 29, 2021, 4:45 PM IST

ప్రపంచంపై కరోనా వైరస్ రూపు మార్చుకుంటూ పంజా విసురుతోంది. కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ (Omicron origin covid)​ వేరియంట్.. అన్ని దేశాలను కుదిపేస్తోంది. అయితే, కొత్త వేరియంట్లు ఎలా (how new variant emerge) ఉద్భవిస్తాయి? ఎందుకు అంత ప్రమాదకరంగా మారుతాయి? ఒమిక్రాన్ ఎలా పుట్టింది? అనే విషయాలపై నిపుణులు ఏమంటున్నారంటే?

VIRUS OMICRON VACCINES
VIRUS OMICRON VACCINES

కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తి తగ్గుతున్న క్రమంలోనే కొత్త వేరియంట్లు ఉద్భవిస్తుండటం ఆందోళకరంగా మారింది. ఒమిక్రాన్ వెలుగులోకి (omicron variant news) వచ్చిన తర్వాత టీకా పంపిణీ, వైరస్ మ్యూటేషన్లు, కొత్త వైరస్​పై వ్యాక్సిన్ల సమర్థత అంశాలు మరోసారి తెరపైకి వచ్చాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో టీకా కవరేజీ తక్కువగా ఉండటం వల్లే కొత్త స్ట్రెయిన్లు (how new variants of covid-19 form) పుట్టుకొస్తున్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే కొత్త వేరియంట్లు బయటపడటంలో వ్యాక్సినేషన్ పాత్ర ఎంతవరకు ఉందనే విషయంపై స్పష్టత లేదు.

కొత్త వేరియంట్లు ఎలా పుడతాయంటే?

పునరుత్పత్తి సాధించిన ప్రతిసారి వైరస్​లు సాధారణంగానే మార్పు చెందుతాయి. వైరస్ జీవితక్రమంలో ముఖ్యమైన అంశాలు రెండు. వైరస్ పునరుత్పత్తి నిర్మాణం, కణాలలోకి ప్రవేశించి పునరుత్పత్తికి తోడ్పడే ప్రోటీన్.

ఇన్ఫెక్షన్ కలిగించేందుకు కొన్ని సార్స్​వైరస్​లు మాత్రమే అవసరమవుతాయి. ఇవి ఊపిరితిత్తుల్లోకి చేరి పునరుత్పత్తి చేయడం ప్రారంభిస్తే రోగికి ప్రమాదకరంగా మారుతుంది. రోగి శరీరంలో లక్షల కొద్ది వైరస్ కణాలు పుట్టుకొస్తాయి. ఇందులో కొన్ని కణాలు రోగి శరీరం నుంచి (శ్వాసకోశం ద్వారా) బయటకు వచ్చి ఇతరులకు (how new variant of coronavirus spread) వ్యాపిస్తాయి. వైరస్ కణాలు ఉద్భవించే క్రమంలో ఆర్ఎన్ఏ పునరుత్పత్తి సరిగా జరగదు. దీంతో వైరస్​ నిర్మాణంలో తప్పులు దొర్లుతాయి. తద్వారా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయి.

సార్స్-కోవ్-2 వేరియంట్లలో కొన్ని ప్రమాదకరంగా మారడానికి కారణం?

వైరస్​లు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తించినప్పుడు కొన్ని వేరియంట్లు కణాల్లోకి చొరబడే సామర్థ్యాన్ని అధికంగా కలిగి ఉంటాయి. మరికొన్ని వేరియంట్లు పునరుత్పత్తిలో మెరుగ్గా ఉంటాయి. కొన్ని 'ఫిట్టర్' వేరియంట్లు ప్రధాన వైరస్​గా మారుతుంటాయి.

మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఈ ప్రక్రియ ఎన్నో సార్లు జరిగింది. 2019లో వుహాన్​లో ఉద్భవించిన సార్స్-కోవ్-2 వైరస్​ స్థానంలో డీ614జీ అనే వేరియంట్ ప్రధాన వైరస్​గా (Sars Cov variants of concern) మారింది. ఆ తర్వాత ఆల్ఫా, డెల్టా వేరియంట్లు (sars-cov-2 variants list) ఈ స్థానాన్ని భర్తీ చేశాయి. ఎవరికైనా సార్స్-కోవ్-2 సోకితే.. ఆ రోగి శరీరం మరింత చురుకైన వేరియంట్లను ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. అవి ఆ రోగి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి.

వైరస్ మార్పులపై వ్యాక్సిన్ల ప్రభావం ఏంటి?

డెల్టా స్ట్రెయిన్ సహా సార్స్-కోవ్-2పై ప్రస్తుత వ్యాక్సిన్లు అత్యంత ప్రభావవంతంగానే పనిచేస్తున్నాయి. వ్యాక్సిన్లు వైరస్ స్పైక్ ప్రోటీన్​ను లక్ష్యంగా చేసుకుంటాయి. స్పైక్ ప్రోటీన్ సాధారణంగా ఎక్కువ మార్పులకు లోను కాదు. కాబట్టి వైరస్​పై టీకాలు ఇంకా పనిచేస్తున్నాయి.

అయితే, బీటా, గామా, లాంబ్డా, మ్యూ వంటి కొన్ని వేరియంట్లు వ్యాక్సిన్ ఇమ్యూనిటీని (new virus immune to vaccine) సమర్థంగా ఎదుర్కొంటున్నాయి. రోగనిరోధక వ్యవస్థ ప్రధాన వైరస్​ను, వేరియంట్ స్ట్రెయిన్​ను గుర్తించకపోవడమే ఇందుకు కారణం. ఇలా జరిగితే వ్యాక్సిన్ సమర్థత తగ్గిపోతుంది. అయితే, రోగనిరోధకతను ఎదిరించే వేరియంట్ల ప్రభావాలు ప్రపంచ వ్యాప్తంగా పరిమితంగానే ఉంది.

వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉంటే.. కొత్త వేరియంట్లు ఉద్భవించే ప్రమాదం అధికంగా ఉంటుందా?

ఇప్పటికైతే, టీకా కవరేజీకి, సార్స్-కోవ్-2 వేరియంట్ల ఉత్పత్తికి ఉన్న సంబంధంపై స్పష్టత లేదు. తక్కువ కవరేజీ వల్ల నిర్దిష్ట కమ్యూనిటీలో వైరస్ వ్యాప్తి పెరిగి కొత్త వేరియంట్లు ఉద్భవించే ప్రమాదం పెరుగుతుంది.

వ్యాక్సినేషన్ రేటు పెరిగిన కొద్దీ.. రోగనిరోధకతను తప్పించుకునే కొన్ని రకాల వేరియంట్లు మాత్రమే మనుగడ సాధించగలుగుతాయి. ఇలా జరగాలంటే.. ప్రపంచవ్యాప్తంగా నిరంతరం వైరస్​పై పోరాటం కొనసాగాలి. వ్యాక్సిన్ సమర్థత సైతం సుదీర్ఘకాలం ఉండాలి. ఈ రెండింటిలో ఏది జరిగినా.. కొవిడ్ ఇప్పుడే కనుమరుగు కాదన్న విషయం అర్థమవుతోంది. కొత్త స్ట్రెయిన్​లు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఈ సవాల్​ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.

ఒమిక్రాన్ ఎలా ఉద్భవించింది?

ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా ప్రమాదఘంటికలు మోగిస్తోంది. సౌతాఫ్రికా శాస్త్రవేత్తలు చేసిన అద్భుతమైన పరిశోధనల వల్ల ఒమిక్రాన్​ స్పైక్ ప్రోటీన్​ 32 మ్యూటేషన్లు ఉన్నట్లు వెల్లడైంది. వ్యాప్తిని అధికం చేసే మ్యూటేషన్లతో పాటు రోగనిరోధకతను తప్పించుకునే మ్యూటేషన్లు రెండూ కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఉన్న కొన్ని వ్యాక్సిన్లనూ సమర్థంగా ఎదుర్కొనే అవకాశం ఉంది.

దక్షిణాఫ్రికాలో తక్కువ వ్యాక్సిన్ కవరేజీ సైతం ఒమిక్రాన్ పుట్టుకకు కారణమని (omicron origin covid) కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, ప్రమాదకరమైన ఒమిక్రాన్ ఆవిర్భావానికి వైరస్​లో ఇదివరకు సంభవించిన మార్పులు సైతం కారణమై ఉండొచ్చు. మ్యూటేషన్లు అధికంగా ఉన్న వేరియంట్లు ఇదివరకూ పుట్టుకొచ్చాయి. అయితే అవేవీ ఇంత వేగంగా వ్యాప్తి చెందలేదు.

టీకాలే శరణ్యం?

టీకాలను సరఫరా చేసి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ కవరేజీని పెంచడం ద్వారా వైరస్​ పరిణామాన్ని పరిమితం చేయవచ్చు. ఎక్కువ మ్యూటేషన్లు ఉన్న వేరియంట్లు అధికంగా వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు. టీకా వ్యాప్తి అనేది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కొత్త వేరియంట్ల వ్యాప్తిని కట్టడి చేస్తాయి.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details